వాగులో చిక్కుకున్న టెంపో
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:17 AM
దైవదర్శనానికి వెళ్తూ వాగులో చిక్కుకున్న వాహనంలోని ప్రయాణికులను ప్రకాశం జిల్లా పామూరు పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

పోలీసుల చొరవతో 12మంది ప్రయాణికులు సురక్షితం
పామూరు, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): దైవదర్శనానికి వెళ్తూ వాగులో చిక్కుకున్న వాహనంలోని ప్రయాణికులను ప్రకాశం జిల్లా పామూరు పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కడపకు చెందిన 12 మంది భద్రాచలానికి టెంపోలో బయలుదేరారు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బొట్లగూడూరు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నల్లవాగులో వీరి వాహనం చిక్కుకుంది. దీంతో ఆందోళన చెందిన ప్రయాణికులు 100కు ఫోన్ చేశారు. సమాచారం అందుకొన్న ఎస్‌ఐ టి.కిశోర్‌బాబు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ఎక్స్‌కవేటర్ సహాయంతో వాహనాన్ని బయటకు తీయించారు. ప్రయాణికులను మరో వాహనంలో స్వగ్రామాలకు పంపించారు. తమను కాపాడిన పోలీసులకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.