Share News

పల్లె పండుగ..

ABN , Publish Date - Oct 11 , 2024 | 12:20 AM

పల్లె పండుగను అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా ప్రజలు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

పల్లె పండుగ..

ఉపాధి నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు

14వ తేదీ నుంచి 20 వరకు శంకుస్థాపన వారోత్సవాలు

జిల్లాలో 212.75 కిలోమీటర్ల మేర రూ.102.74 కోట్లతో 990 సీసీ రహదారులు

గ్రామాల్లో అట్టహాసంగా వేడుకల ఏర్పాట్లు

ఏలూరుసిటీ, అక్టోబరు 10 : పల్లె పండుగను అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా ప్రజలు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పల్లె పండుగ పేరిట రహదారుల శంకుస్థాపన వారోత్సవాలను ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఘనంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం అయింది. జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో రహదారులపై గుప్పెడు మట్టెయినా వేసిన పాపాన పోలేద న్న విషయం అందరికీ విదితమే. ఎక్కడ చూసినా రహదారులు గోతులమయంతో దర్శనమిస్తున్నా యి. ఇక గ్రామాల్లో రహదారుల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. గత ఐదేళ్లలో రహదారుల దుస్థితిని వైసీపీ ప్రజా ప్రతినిధులు పట్టించుకో దన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతు న్నాయి. ఈ గోతుల రహదారులపై ప్రయాణిస్తూ ఎంతో మంది మృత్యువాత పడ్డారు. కొందరు గాయాలతో బయట పడ్డారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ఆగస్టు 23న జిల్లాలో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి చేపట్టాల్సిన పనులపై తీర్మానాలు చేశారు. ఉపాధి హామీ కూలీలకు 100 రోజుల పనిని కల్పించడమే ప్రధాన ధ్యేయంగా పల్లె పండుగ వారోత్సవా లను నిర్వహించనున్నారు. ఉపాధి హామీ పనులతో పాటు మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులతో రహదారులు, డ్రెయిన్ల అభి వృద్ధి చేయడానికి ప్రణా ళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే కలెక్టర్‌ కె.వెట్రి సెల్వి ఆధ్వర్యంలో పల్లె పండుగ వారోత్సవాల నిర్వహణపై జిల్లాలోని అధికారులకు దిశ, నిర్ధే శం చేశారు.

మొదటి దశలో చేపట్టే పనులు..

పల్లెపండుగ – శంకుస్థాపన వారోత్సవాలను జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈనె 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మొదటి దశలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా జిల్లాలో 212.75 కిలోమీటర్లు మేర 990 సీసీ రోడ్ల పనులను చేపట్టడానికి రూ.102.74 కోట్లు నిధులను కేటాయించారు. ఇవి గాక జిల్లాలో రూ.29 లక్షలతో మూడు చోట్ల కాంపౌండ్‌ వాల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. పశువులు, గొర్రెలు, మేకల పెంపకానికి షెడ్లుకు సంబంధించి 842 పనులను చేపట్టనున్నారు. దీనికి సంబంధించి రూ.18.55 కోట్లు ఉపాధి నిధులను కేటాయించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ధేశిం చిన విధంగా పండుగ వాతావరణంలో అన్ని పనుల నిర్మాణా లకు శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ పల్లెపండుగ కార్యక్రమాలు ప్రజా ప్రతినిధుల సమక్షంలో జరగాలని, ఈ పనులు సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

ఉపాధి కూలీలకు 100 రోజుల పని

గ్రామీణ కుటుంబాలకు నివాసం ఉంటున్న గ్రామాల్లోనే ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. పని కోరిన 15 రోజుల్లో పనిని పొందే హక్కు కల్పించాల్సి ఉంది. నివాస గృహానికి ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటే రోజు కూలీకి అదనంగా 10 శాతం వేతనం ఇవ్వాలి. ఈ పనుల నిర్వహణపై కలెక్టర్‌ వెట్రిసెల్వి అధికారులతో సమీక్షించారు. ఉపాధి కూలీలు పనిచేసే ప్రదేశాల్లో వేతన జీవులు మరణించినా, లేదా పూర్తి అంగ వైకల్యానికి గురైనా ఆ కుటుంబానికి నష్ట పరిహారం అందించాలన్నారు. ఆగస్టు 23న జిల్లాలో ఒకే రోజున నిర్వహించిన గ్రామ సభ్లో తీర్మానించిన పనులన్నింటినీ పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో మరింత పారదర్శకత, ప్రజల్లో జవాబుదారీతనం, పెంచేందుకు పనులను అందరూ కలిసి పండుగ వాతావరణంలో భూమి పూజ చేయా లని, ప్రభుత్వ సంకల్పానికి అందరూ సహకరించాలన్నారు. సిమెంట్‌, బీటీ రోడ్లు, హార్టికల్చర్‌, ఫాంపాండ్స్‌, గోకులాలు, ట్రెంచ్‌లు తదితర పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు పల్లె పండుగలో నిర్వహించాల న్నారు. ప్రతి పంచాయతీలో ప్రజలకు కనిపించే విధంగా 2024–25 సంవత్సరం చేపట్టబోయే పనులు, పూర్తి చేసిన పనులు వివరాలు తెలిపే సిటిజన్‌ నాలెడ్జ్‌ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పనులు పూర్తి స్థాయిలో నాణ్యత ప్రమాణాలతో ఉండాలని అధికారులను ఆదేశించారు.

తీర్మానించిన పనులకే ఉపాధి నిధులు

జిల్లాలో పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడు తున్నా జాతీయ ఉపాధి హామీ నిధులు ఆసరాగా నిలుస్తు న్నాయి. అందుకే గ్రామాల్లో జరిగే అఽభివృద్ధి అంతా ఉపాధి నిధులతోనే జరుగుతోంది. ఇక ఈ సారి ఉపాఽధి హామీ నిధుల కేటాయింపును గ్రామసభల్లో తీర్మానించిన పనులకు మాత్రమే కేటాయించనున్నారు. ఇలా గ్రామాలను అభివృద్ది చేయడానికి వీలుగా గ్రామాల్లో అట్టహాసంగా పల్లెపండుగ వారోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు.

గ్రామాల్లో రహదారుల అభివృద్ధి

కేవీ సుబ్బారావు, డ్వామా పీడీ

జిల్లాలో పల్లె పండుగ సందర్భంగా వివిధ అభివృద్ధి పనుల వారోత్సవాలను కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. జిల్లాలో ఈనెల 14 నుంచి 20 వరకు పల్లెపండుగ శంకుస్థాపన వారోత్సవాలను నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. జిల్లాలో పెద్ద ఎత్తున సీసీ రహదారులు ఏర్పాటుతో పాటు ఉపాధి కూలీలకు 100 రోజులు పనులు కల్పించే నిమిత్తం ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో నిర్వహించే పనులను, ఆగస్టు 23న గ్రామ సభల్లో తీర్మానం చేసిన పనులను చేపట్టనున్నాం. ప్రజల భాగస్వామ్యంతో ఈ పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశాం.

Updated Date - Oct 11 , 2024 | 12:20 AM