Share News

వేదవతి ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలంటూ పాదయాత్ర

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:18 AM

ఆలూరు ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే వేదవతి ప్రాజెక్ట్‌ ఎంతో అవసరమని తక్షణమే నిధులు విడుదల చేసి నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ గురువారం వేదవతి ప్రాజెక్ట్‌ సాధన మితి ఆధ్వర్యంలో గూళ్యం నుంచి ఆలూరుకు పాదయాత్ర నిర్వహించారు

వేదవతి ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలంటూ పాదయాత్ర

ఆలూరు, మార్చి 7: ఆలూరు ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే వేదవతి ప్రాజెక్ట్‌ ఎంతో అవసరమని తక్షణమే నిధులు విడుదల చేసి నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ గురువారం వేదవతి ప్రాజెక్ట్‌ సాధన మితి ఆధ్వర్యంలో గూళ్యం నుంచి ఆలూరుకు పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా ఆలూరు తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్‌ చంద్రశేఖర్‌కు వినతిపత్రం ఇచ్చారు. టీడీపీ నాయకులు ఎల్లార్తి మల్లికార్జున, సురేంద్ర వేదవతి ప్రాజెక్ట్‌ సాధన కమిటీ సభ్యులు అర్జున్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వేదవతి ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి ఉంటే నేడు కరువు నుంచి ఆలూరు ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో విముక్తి కలిగేదని అన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసి వేదవతి ప్రాజెక్టును నిర్మించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 08 , 2024 | 12:18 AM