మన సీఎం చంద్రబాబునాయుడు!
ABN , Publish Date - May 04 , 2024 | 02:55 AM
‘మన సీఎం చంద్రబాబునాయుడు’ అంటూ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు చేసిన వ్యాఖ్య అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
జగన్ సభలో మాజీ ఎమ్మెల్యే కదిరి తడబాటు
ఇంకా.. బాబుపై అభిమానం పోలేదన్న జనం
కనిగిరి, మే 3: ‘మన సీఎం చంద్రబాబునాయుడు’ అంటూ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు చేసిన వ్యాఖ్య అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సభలో కదిరి ప్రసంగిస్తూ.. ఓ సామాన్య వ్యక్తి అయిన దద్దాల నారాయణయాదవ్‌ను ‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు’ కనిగిరి అసెంబ్లీ అభ్యర్థిగా ఎంపిక చేశారు’ అని అన్నారు. దీంతో పక్కనే ఉన్న అభ్యర్థి దద్దాల కలగజేసుకుని.. ‘మన ముఖ్యమంత్రి జగన్’ అని చెవిలో ఊదటంతో నాలుక కరుచుకున్న కదిరి.. అప్పుడు జగన్ పేరును ప్రస్తావించారు. ‘చంద్రబాబుపై, సైకిల్‌పై అభిమానం పోలేదు. అయినా ఆయనకు ఈ పొరపాట్లు.. గ్రహపాట్లు కొత్తేమీ కాదు. పాపం కదిరి’.. అంటూ జనం మాట్లాడుకోవడం కొసమెరుపు!