ఒంగోలు ఎంపీ పరిధిలో ఒక్క తాటిపై నడుస్తాం: చెవిరెడ్డి
ABN , Publish Date - Feb 06 , 2024 | 03:50 AM
ఒంగోలు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులంతా ఒక్క తాటిపై నడుస్తామని పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వెల్లడించారు.
అమరావతి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులంతా ఒక్క తాటిపై నడుస్తామని పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వెల్లడించారు. ఈ ఎంపీ స్థానంలో ఆయనే పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. సోమవారం విజయవాడలో ఒంగోలు లోక్‌సభ పరిధిలోని వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులు మాజీ మం త్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు), మంత్రి ఆదిమూలపు సురేశ్ (కొండపి), ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు (మార్కాపురం), కుందూరు నాగార్జునరెడ్డి (గిద్దలూరు), మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి (దర్శి), తాటిపర్తి చంద్రశేఖర్ (యర్రగొండపాలెం), దద్దాల నారాయణ (కనిగిరి)తో ఆయన సమావేశమయ్యారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా జరిగిన ఈ భేటీలో.. అంతా ఒక్కటిగా నిలిచి విజయం సాధించాలన్న నిర్ణయానికి వచ్చారు. మొన్నటి వరకూ చెవిరెడ్డిని వ్యతిరేకిస్తూ వచ్చిన బాలినేని ఈ భేటీకి హాజరయ్యారు. అనంతరం చెవిరెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. తామంతా ఒక్కటేనని చెప్పారు.