Share News

‘ఒంగోలు’ ఎద్దు @ 19 లక్షలు

ABN , Publish Date - Dec 08 , 2024 | 05:33 AM

ఒంగోలు జాతి వృషభం రికార్డు స్థాయిలో రూ.19 లక్షలా 1,116ల ధర పలికింది. పల్నాడు జిల్లా నాదెండ్ల గ్రామానికి చెందిన దేవాబత్తుని భద్రయ్య కుమారులు నరేంద్రబాబు, శేఖర్‌ నుంచి అనంతపురం జిల్లా ఎ.నారాయణపురం

‘ఒంగోలు’ ఎద్దు  @ 19 లక్షలు

నాదెండ్ల, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు జాతి వృషభం రికార్డు స్థాయిలో రూ.19 లక్షలా 1,116ల ధర పలికింది. పల్నాడు జిల్లా నాదెండ్ల గ్రామానికి చెందిన దేవాబత్తుని భద్రయ్య కుమారులు నరేంద్రబాబు, శేఖర్‌ నుంచి అనంతపురం జిల్లా ఎ.నారాయణపురం గ్రామానికి చెందిన షేక్‌ మహబూబ్‌ బాషా ఈ మొత్తం చెల్లించి కొనుగోలు చేశారు. సుమారు ఏడు సంవత్సరాల వయస్సు కలిగిన ఈ వృషభం జూనియర్‌ సైజ్‌ విభాగంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో పలుమార్లు బహుమతులను సాధించి గ్రామానికి పేరుతెచ్చిందని భద్రయ్య కుమారులు తెలిపారు.

Updated Date - Dec 08 , 2024 | 05:33 AM