లారీ ఢీకొని ఒకరి మృతి
ABN , Publish Date - May 26 , 2024 | 11:26 PM
లారీని బైక్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మొలకలచెరువు సమీపంలోని తనకల్లు గ్రామానికి చెందిన నరసింహులు (26) ఐదారేళ్ల క్రితం మండల కేంద్రానికి వచ్చి రేషన్‌బియ్యం లోడింగ్, అన్‌లోడింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.
చిన్నమండెం, మే 26: లారీని బైక్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మొలకలచెరువు సమీపంలోని తనకల్లు గ్రామానికి చెందిన నరసింహులు (26) ఐదారేళ్ల క్రితం మండల కేంద్రానికి వచ్చి రేషన్‌బియ్యం లోడింగ్, అన్‌లోడింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆదివారం మధ్యాహ్నం పెట్రోలు బంకు సమీపంలోని బంధువుల ఇంటికి బైక్‌పై వెళుతూ గురు హోటల్ సమీపంలో ముందు వెళుతున్న లారీని ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతనికి కొన్న నెలల కిందటే వివాహం జరగగా ప్రస్తుతం అత డి భార్య గర్భిణి అని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై ఇప్పటి వరకు తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.