Share News

ఒకరు టాప్‌.. మరొకరు లాస్ట్‌..

ABN , Publish Date - Jul 23 , 2024 | 02:32 AM

వాళ్లిద్దరూ ఒకే పార్టీ నాయకులు. వెనుక బడిన ప్రాంతాలకు చెందినవారు. ఒకరు పల్లా శ్రీనివాస్‌..

ఒకరు టాప్‌.. మరొకరు లాస్ట్‌..

అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): వాళ్లిద్దరూ ఒకే పార్టీ నాయకులు. వెనుక బడిన ప్రాంతాలకు చెందినవారు. ఒకరు పల్లా శ్రీనివాస్‌.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైతే మరొకరు ఎస్‌సీ విభాగం అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు. ఒకరు ఉత్తరాంధ్ర నుంచి, మరొకరు సీమ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ లాబీల్లో వారిద్దరూ ఎదురుపడి పలకరించుకున్నారు. ఈ సన్నివేశాన్ని చూసిన ఇతర ఎమ్మెల్యేలు ‘ఒకరు టాప్‌.. మరొకరు లాస్ట్‌’ అంటూ సరదాగా చేసిన వ్యాఖ్య అసెంబ్లీ లాబీల్లో నవ్వులు పూయించింది. ఎన్నికల ఫలితాల్లో అత్యధికంగా 95 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో పల్లా శ్రీనివాస్‌ గెలుపొందగా, ఎమ్మెస్‌ రాజు అత్యల్పంగా 351 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. ఏదేమైనా ఇద్దరూ ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేలే కదా! అని మరొకరు వ్యాఖ్యానించడం అక్కడ మరోమారు నవ్వులు పూయించింది.

Updated Date - Jul 23 , 2024 | 07:38 AM