Share News

పేపర్‌ లీక్‌కు కోటి జరిమానా.. లోక్‌సభలో బిల్లు

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:16 AM

ప్రభుత్వ నియామక పోటీ పరీక్షల్లో అవకతవకలకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.

పేపర్‌ లీక్‌కు కోటి జరిమానా.. లోక్‌సభలో బిల్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ప్రభుత్వ నియామక పోటీ పరీక్షల్లో అవకతవకలకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రం లేదా జవాబులు లీక్‌ చేయడం, అభ్యర్థులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించడం, నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి మోసగించడం వంటి నేరాలకు పాల్పడిన వారికి కనీసం మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. కోటి వరకూ జరిమానా విధించేలా కొత్త బిల్లును తీసుకొచ్చింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) బిల్లు-2024ను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

Updated Date - Feb 06 , 2024 | 04:16 AM