24న ఏప్రిల్ నెల రూ.300 దర్శన టికెట్ల కోటా విడుదల
ABN , Publish Date - Jan 18 , 2024 | 04:08 AM
తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన ఏప్రిల్ నెల కోటాను టీటీడీ ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది.
నేటి నుంచి అందుబాటులోకి ఆర్జితసేవల కోటా లక్కీడిప్
తిరుమల, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన ఏప్రిల్ నెల కోటాను టీటీడీ ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. అలాగే ఏప్రిల్ నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జితసేవల ఆన్‌లైన్ లక్కీడిప్ కోసం 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవచ్చు. లక్కీడి్‌పలో ఎంపికైన భక్తులు జనవరి 22వ తేదీ మఽఽధ్యాహ్నం 12 గంటలలోపు టికెట్ ధర చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లను జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వర్చువల్ సేవా టికెట్లను కూడా అదే రోజు మఽధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ వరకు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన టికెట్లను 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆంగప్రదక్షిణ టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు, శ్రీవాణి టికెట్లను ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే తిరుమల, తిరుపతిలో వసతి గదుల కోటాను కూడా జనవరి 24న మఽధ్యాహ్నం 3 గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు. మరోవైపు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను 27 ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు నవనీతసేవ, మధ్యాహ్నం ఒంటిగంటకు పరకామణి సేవలను విడుదల చేయనున్నారు. భక్తులు వీటిని ‘టీటీదేవస్థానమ్స్.ఏపీ.జీవోవీ.ఇన్’ అనే వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.