ఏనుగు దాడిలో వృద్ధుడు మృతి
ABN , Publish Date - Oct 25 , 2024 | 04:51 AM
ఏనుగుల దాడి లో ఓ వృద్ధుడు మృతి చెందాడు.

పార్వతీపురం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఏనుగుల దాడి లో ఓ వృద్ధుడు మృతి చెందాడు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం పెదబొండపల్లికి చెందిన దేవాబత్తుల యాకోబు(74) గురువారం పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఏనుగులు దాడి చేశాయి. తీవ్ర గాయాలపాలైన ఆయన్ని గ్రామస్థులు పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు.