స్వచ్ఛందంగా హిందూమతంలోకి వచ్చేవారికి పవిత్రజల సంప్రోక్షణ
ABN , Publish Date - Feb 06 , 2024 | 03:46 AM
ఇతర మతస్తులు ఎవరైనా స్వచ్ఛందంగా హిందూ మతంలోకి మారడానికి ముందుకు వస్తే వారి కోసం తిరుమలలో ప్రత్యేక ప్రాంగణం ఏర్పాటు చేసి పవిత్రజల ప్రోక్షణం చేసి స్వాగతించాలని ధార్మిక సదస్సులో పీఠాపధిపతులు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు.
దీనికోసం తిరుమలలో ప్రత్యేక ప్రాంగణం ఏర్పాటు
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి
ముగిసిన ధార్మిక సదస్సు
తిరుమల, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ఇతర మతస్తులు ఎవరైనా స్వచ్ఛందంగా హిందూ మతంలోకి మారడానికి ముందుకు వస్తే వారి కోసం తిరుమలలో ప్రత్యేక ప్రాంగణం ఏర్పాటు చేసి పవిత్రజల ప్రోక్షణం చేసి స్వాగతించాలని ధార్మిక సదస్సులో పీఠాపధిపతులు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో సోమవారం జరిగిన ధార్మిక సదస్సు ముగింపు కార్యక్రమంలో పీఠాధిపతులు, ఈవో ధర్మారెడ్డితో కలిసి స్వామీజీలు చేసిన 19 తీర్మానాలను చైర్మన్ మీడియాకు వివరించారు. ఇతర మతాలకు చెందిన వారిని విధిపూర్వకంగా స్వాగతించాలని, ఒకసారి శ్రీవారి దర్శనం కల్పించాలని సదస్సు తీర్మానించినట్టు వివరించారు.