Share News

అడ్డదిడ్డం.. గడ్డం గ్యాంగ్‌!

ABN , Publish Date - Jan 07 , 2024 | 04:32 AM

వివాదాలకు ఆయన కేరాఫ్‌ అడ్రస్‌! మాటలు, చేతలు రెండూ అలాగే ఉంటాయి. టీడీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత వైసీపీ గూటికి చేరారు.

అడ్డదిడ్డం.. గడ్డం గ్యాంగ్‌!

బూతుల ఎమ్మెల్యే ఇలాకాలో అరాచకాలు

అధికార పార్టీ ఎమ్మెల్యేలలో ఆయనకో ‘ప్రత్యేక’ గుర్తింపు ఉంది. నోరు తెరిస్తే బూతుపురాణమే! జూదం విషయంలో నియోజకవర్గ కేంద్రాన్ని గోవా స్థాయికి తీసుకెళ్లారు. కేసినో, పేకాట శిబిరాల నిర్వహణలో ఆయనకున్న రికార్డు రాష్ట్రంలో మరే ప్రజాప్రతినిధికీ లేకపోవచ్చు! కృష్ణా జిల్లాకు చెందిన ఆ నేత పేరు వింటేనే ప్రజలు చీదరించుకునే పరిస్థితి!

ఆ ఎమ్మెల్యేకు తన అనుచరులతో కబ్జాలు, దందాలు చేయించడం నిత్యకృత్యం. నియోజకవర్గంలో వారికి ‘గడ్డం గ్యాంగ్‌’ అని పేరు. ఈ పేరు వింటేనే స్థానిక ప్రజలు వణికిపోతారు. పేకాట నిర్వహణతో వేలాది కుటుంబాలు రోడ్డున పడేలా చేశారు. ఇక ఇసుక అక్రమ రవాణాతో ఎమ్మెల్యే, అనుచరులు రూ.కోట్లు దోచుకున్నారు.

నియోజకవర్గంలో గోవా స్థాయి జూదం.. కేసినో, పేకాట శిబిరాల నిర్వహణలో రికార్డు

2022లో కేసినోలో రూ.10 కోట్ల సంపాదన

ఇసుక రవాణాలో కోట్లు కుమ్మేసిన వైనం

గడ్డం గ్యాంగ్‌ను అడ్డుపెట్టుకుని కబ్జాలు, దందాలు

50 కోట్ల విలువ చేసే లేఔట్‌ ఆక్రమణ

అప్పు ఇవ్వకున్నా రూ.50 లక్షలు

డిమాండ్‌ చేయడంతో రియల్టర్‌ ఆత్మహత్య

(మచిలీపట్నం-ఆంధ్రజ్యోతి)

వివాదాలకు ఆయన కేరాఫ్‌ అడ్రస్‌! మాటలు, చేతలు రెండూ అలాగే ఉంటాయి. టీడీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత వైసీపీ గూటికి చేరారు. అక్రమార్జనతో ఆయన ఆస్తి పెరుగుతూ పో..తోంది. 2009 ఎన్నికల అఫిడవిట్‌లో రూ.1.19 కోట్లుగా ఉన్న ఆస్తి.. 2014నాటికి రూ.11.55 కోట్లకు, 2019 నాటికి రూ.14.82 కోట్లకు

చేరింది. ప్రస్తుతం ఆస్తుల విలువ ఎంత పెరిగిందో ఊహించలేం. వైసీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యాక ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆయనకు ఎదురే లేకుండా పోయింది. కొత్త ఇసుక పాలసీ ఆయనకు కాసుల పంట పండించింది. తూర్పు కృష్ణాలోని ఇసుక రీచ్‌లన్నింటినీ తన కబ్జాలో పెట్టుకుని దోపిడీకి పాల్పడ్డారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు రూ.కోట్లు వెనకేసుకున్నారు. సగటున రో జుకు రూ.2 లక్షల పైచిలుకు ఆదాయంఆర్జించారు.

రూపాయికి వంద వసూలు

గడ్డం గ్యాంగ్‌ అరాచకాలకు ఎందరో బలయ్యా రు. 2021 జూలై 15న నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఓ బడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఆత్మహ త్య చేసుకున్నారు. అప్పు ఇవ్వకున్నా రూ.50 లక్ష లు ఇవ్వాలని డిమాండ్‌ చేయడమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆయన పెద్ద ఎత్తున రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేశారు. కరోనా.. మూడు రాజధానుల ప్రకటన వల్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దెబ్బతింది. గడ్డం గ్యాంగ్‌ అనుచరుల వేధింపుల వల్ల ఆయన ఆత్మహత్య చేసుకునే ముందు కారణాలు వివరిస్తూ సూసైడ్‌ నోట్‌ రాశారు. అసలు తనకు అప్పులు ఇవ్వని వారు కూడా అప్పు ఇచ్చినట్లు బెదిరిస్తున్నారని, లక్ష రూపాయలు ఇచ్చి కోటి రూపాయలు ఇచ్చామని చెబుతున్నారని పేర్కొన్నారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా తమకు రూ.1.15 కోట్లు చెల్లించాలని కొడుకును గడ్డం గ్యాంగ్‌ వేధించింది. పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

కేసినోతో 10 కోట్లు

2022 సంక్రాంతి సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన కేసినో ద్వారా సుమారు రూ.10 కోట్ల ఆదాయాన్ని ఎమ్మెల్యే ఆర్జించినట్లు సమాచారం.

లక్షకు కోటి

గడ్డం గ్యాంగ్‌ అప్పులు ఇవ్వకుండానే ఇచ్చామని బెదిరిస్తుంది. లక్ష రూపాయలు అప్పు ఇచ్చి రూ.కోటి చెల్లించాలని వేధిస్తుంది. వారి వేధింపుల తో ఓ రియల్టర్‌ ఆత్మహత్య చేసుకున్నారు.

50 కోట్ల లేఔట్‌ స్వాహా

నకిలీ పత్రాలు సృష్టించి రూ.50 కోట్లు విలువ చేసే లేఔట్‌ స్థలాలను గడ్డం గ్యాంగ్‌ స్వాధీనం చేసుకుంది. సర్వే రాళ్లను తొలగించి, విద్యుత్‌ స్తంభాలను ధ్వంసం చేసి, స్థలాలను చదును చేసి వ్యవసాయానికి వీలుగా మార్చేసింది. గడ్డం గ్యాంగ్‌ అక్రమార్జనంతా ఎమ్మెల్యేకే చేరుతుంది.

మంత్రి హోదాలో వసూళ్లు

కృష్ణా జిల్లాలో 200కు పైగా బియ్యం మిల్లు లు ఉన్నాయి. 2019-20కి సంబంధించి లెవీ బియ్యం మిల్లింగ్‌, తేమ శాతం అధికంగా ఉన్న ధాన్యం డ్రయ్యర్‌ చార్జీలు, పొలం నుంచి మిల్లు కు ధాన్యం రవాణాచార్జీలు, తదితర ఖర్చులకుగాను రైస్‌ మిల్లులకు బిల్లుల రూపంలో రూ. 100 కోట్లను అప్పట్లో ప్రభుత్వం విడుదల చేసింది. మిల్లర్ల ఖాతాల్లో ఈ నగదు జమైంది. మిల్లర్లకు వచ్చిన రూ.100 కోట్ల నుంచి 8 శా తం(8కోట్లు) పార్టీ ఫండ్‌ పేరుతో రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ నాయకుల నుంచి మంత్రి హోదాలో సదరు ఎమ్మెల్యే వసూలు చేశారు.

Updated Date - Jan 07 , 2024 | 04:32 AM