Share News

ఎనఎ్‌సయూఐ నేతది సుపారీ హత్యే

ABN , Publish Date - Jun 11 , 2024 | 10:42 PM

హిందూపురానికి చెందిన ఎనఎ్‌సయూఐ జాతీయ కార్యదర్శి, న్యాయవాది సంపతకుమార్‌ది సుపారీ హత్యేనని పోలీసుల విచారణలో తేలింది. రూ.55 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడైంది. కర్ణాటకలో హత్య చేసి, ధర్మవరం చెరువు కట్ట వద్ద శవాన్ని పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

ఎనఎ్‌సయూఐ నేతది సుపారీ హత్యే
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, కత్తులను చూపుతున్న డీఎస్పీ, సీఐ

రూ.55 లక్షలకు ఒప్పందం.. కర్ణాటకలో హత్య చేసి.. ధర్మవరం చెరువుకట్ట వద్ద పడేసిన వైనం..

ఐదుగురు నిందితుల అరెస్టు.. రూ.7లక్షల నగదు, కత్తుల స్వాధీనం

ధర్మవరం, జూన 11: హిందూపురానికి చెందిన ఎనఎ్‌సయూఐ జాతీయ కార్యదర్శి, న్యాయవాది సంపతకుమార్‌ది సుపారీ హత్యేనని పోలీసుల విచారణలో తేలింది. రూ.55 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడైంది. కర్ణాటకలో హత్య చేసి, ధర్మవరం చెరువు కట్ట వద్ద శవాన్ని పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వారి నుంచి రూ.7లక్షల నగదు, హత్యకు ఉపయోగించిన కత్తులు, సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు ఛేదింపు వివరాలను స్థానిక వనటౌన పోలీసు స్టేషనలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వెల్లడించారు. హిందూపురం పట్టణానికి చెందిన కృష్ణారెడ్డి ఇంటి ముందున్న స్థలం విషయంలో శ్రీకాంతరెడ్డితో విభేదాలున్నాయి. శ్రీకాంతరెడ్డి.. సంపతకుమార్‌కు మిత్రుడు కావడంతో ఈ వివాదంలో కలుగజేసుకున్నారు. సంపతకుమార్‌పై న్యాయవాది కృష్ణారెడ్డి పోలీసు స్టేషనలో కేసులు పెట్టారు. కృష్ణారెడ్డిపై సంపతకుమార్‌ కూడా కేసులు పెట్టించారు. ఈ నేపథ్యంలో గతనెల 26న ముద్దిరెడ్డిపల్లికి చెందిన సెటిల్‌మెంట్‌ రామాంజనేయులుతోపాటు అతడి అనుచరులు ధర్మవరం పట్టణం సిద్దయ్యగుట్టకు చెందిన రంగం రవీంద్ర (ప్రస్తుతం హిందూపురంలో నివాసం), హిందూపురం వాసులు భూమా లోకేశ, కావలి శ్రీకాంత, జంపుల శ్రీనివాసులునాయుడు.. న్యాయవాది కృష్ణారెడ్డి ఇంట్లో కలిశారు. కృష్ణారెడ్డి, అతడి కుమారుడు నాగార్జునరెడ్డి.. సంపతకుమార్‌ హత్యకు రూ.55లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్సగా రూ.5లక్షలు న్యాయవాది కృష్ణారెడ్డి ద్వారా సెటిల్‌మెంట్‌ రామాంజి తీసుకున్నాడు. హిందూపురానికి చెందిన స్నేహితుడి కారును రామాంజనేయులు కదిరికి వెళ్లాలని తీసుకున్నాడు. సెటిల్‌మెంట్‌ రామాంజితో సంపతకుమార్‌కు పరిచయం ఉండేది. ఈనేపథ్యంలో అతడి హత్యకు పథకం పన్నారు. అందులో భాగంగా హిందూపురంలో ఉన్న సంపతకుమార్‌ను మద్యం తాగుదామని మే 29న రాత్రి రామాంజి కారులో ఎక్కించుకుని, వెళ్లాడు. అందులో శ్రీనివాసులు, రవీంద్ర, లోకేశ, శ్రీకాంత ఉన్నారు. కర్ణాటక రాష్ట్రం చింతలపల్లికి వెళ్లే రోడ్డు పక్కనున్న కాలువ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సంపతకుమార్‌కు బీర్లు తాపించి, ఆ సీసాలతో అతడి తలపై కొట్టి, అనంతరం కొడవళ్లతో ముఖంపై దాడి చేసి, దారుణంగా హత్య చేశారు. సంపతకుమార్‌ శవాన్ని కారు డిక్కీలో వేసుకుని, ధర్మవరం చెరువు రెండో మరువ వద్ద కంపచెట్లలో పడేసి వెళ్లిపోయారు. మే 30న ఉదయం అనంతపురంలో న్యాయవాది కృష్ణారెడ్డి క్లర్క్‌ నరేంద్ర.. రామాంజికి రూ.10లక్షల నగదు అందించాడు. అనంతపురంలో కారు వదిలేసి, వెళ్లిపోయారు. సంపతకుమార్‌ తండ్రి రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు, వనటౌన సీఐ సుబ్రహ్మణ్యం, హిందూపురం వనటౌన సీఐ శ్రీనివాసులు బృందాలుగా విడిపోయి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కనగానపల్లి మండలం మామిళ్లపల్లి క్రాస్‌ వద్ద ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.7 లక్షల నగదు, కత్తులు, కొడవళ్లు, కారు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులున్నారనీ, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ వెల్లడించారు.

Updated Date - Jun 11 , 2024 | 10:42 PM