Share News

అద్దెలు ఎగ్గొట్టారు

ABN , Publish Date - May 19 , 2024 | 11:50 PM

జిల్లా స్పోర్ట్స్‌ ఆధ్వర్యంలో అరికేర రోడ్డులో ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌లో మూడేళ్లుగా అద్దె చెల్లించకుండా ఎగ్గొట్టడం పై దృష్టి సారించిన జిల్లా స్ఫోర్ట్స్‌ అథారిటీ అధికారులు, ఈ నెల 10న నోటీసులు జారీ చేశారు.

అద్దెలు  ఎగ్గొట్టారు

పెండింగ్‌ అద్దెలపై దృష్టి సారించిన అధికారులు

ఇండోర్‌ స్టేడియం దుకాణదారులకు నోటీసులు

ఆలూరు, మే 19: జిల్లా స్పోర్ట్స్‌ ఆధ్వర్యంలో అరికేర రోడ్డులో ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌లో మూడేళ్లుగా అద్దె చెల్లించకుండా ఎగ్గొట్టడం పై దృష్టి సారించిన జిల్లా స్ఫోర్ట్స్‌ అథారిటీ అధికారులు, ఈ నెల 10న నోటీసులు జారీ చేశారు.

వ్యాపారుల నిర్లక్ష్యం

వ్యాపార రీత్యా మంచి డిమాండ్‌ ఉన్న దుకాణాలు.. పోటీపడి మరీ టెండర్లలో దక్కించుకున్నారు. అద్దెలు కూడా ఎక్కువగా ఉండటంతో దుకాణాలను రెండుగా చేసి ఒక్క షాపును అద్దెకు ఇచ్చుకున్నారు. అయినా కూడా మూడేళ్లుగా అద్దెలు మాత్రం చెల్లించలేదు. దీంతో జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ డెవలప్మెంట్‌ అధికారి బీ భూపతి రావ్‌ 6 దుకాణాదారులకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17 లోగా పెండింగ్‌లో ఉన్న అద్దెను చెల్లించనిపక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో, 5 నెలల అద్దె ముట్టించారు. మరో వైపు అద్దెలు కూడా అధికంగానే ఉన్నాయని.. అదే గ్రామ పంచాయతీ పరిధిలో బస్టాండ్‌లో ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఉన్న అద్దెల కన్న రెండింతలు ఎక్కువగా ఉన్నాయని వ్యాపారులు వాపోతున్నారు.

Updated Date - May 19 , 2024 | 11:50 PM