Share News

Rajya Sabha : రాజ్యసభలో కూటమి ఎంపీల ప్రమాణస్వీకారం

ABN , Publish Date - Dec 17 , 2024 | 05:49 AM

ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైనా ఆర్‌.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు, సానా సతీశ్‌ బాబు ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం, రాజ్యసభలో చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ వారితో ప్రమాణం చేయించారు. కూటమికి చెందిన టీడీపీ, బీజేపీ లోక్‌సభ

Rajya Sabha : రాజ్యసభలో కూటమి ఎంపీల ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైనా ఆర్‌.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు, సానా సతీశ్‌ బాబు ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం, రాజ్యసభలో చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ వారితో ప్రమాణం చేయించారు. కూటమికి చెందిన టీడీపీ, బీజేపీ లోక్‌సభ ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరై కొత్త ఎంపీల ప్రమాణస్వీకారాన్ని వీక్షించారు. కొత్త ఎంపీలకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుతో పాటు కూటమి ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొత్త ఎంపీలతో పాటు కూటమి ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌ కార్యాలయంలో చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాలను మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, టీడీపీపీ నేత లావు శ్రీ కృష్ణదేవరాయులు, హరీశ్‌, దగ్గుమళ్ల ప్రసాదరావు, నాగరాజు, మాగుంట శ్రీనివాసులురెడ్డి, సీఎం రమేశ్‌, పురందేశ్వరి పాల్గొన్నారు.

రాజ్యసభలో టీడీపీకి మళ్లీ ప్రాతినిథ్యం

బీద మస్తాన్‌రావు, సానా సతీశ్‌ ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేయడంతో టీడీపీకి రాజ్యసభలో మళ్లీ ప్రాతినిథ్యం లభించింది. టీడీపీ తరఫున ఎంపీగా ఉన్న కనకమేడల రవీంద్రకుమార్‌ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌ తొలి వార ంలో ముగియడంతో అప్పటినుంచి ఆ పార్టీకి రాజ్యసభలో ప్రాతినిథ్యం లేదు.

Updated Date - Dec 17 , 2024 | 05:49 AM