Share News

బీఫాం అందజేసిన నల్లారి

ABN , Publish Date - Apr 22 , 2024 | 11:52 PM

పీలేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి సోమవారం తనకు తెలుగు దేశం పార్టీ అందించిన బీఫాంను రిటర్నింగ్‌ అధికా రికి అందజేశారు.

బీఫాం అందజేసిన నల్లారి
బీఫాం అందజేస్తున్న నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి

పీలేరు, ఏప్రిల్‌ 22: విజయవాడలో ఆదివారం జరిగి న కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి తన బీఫాం అందకున్నారు. సోమవారం ఆయన పీలేరులోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకుని ఆర్‌వో ఫర్మాన అహ్మద్‌కు అందజేశారు.

మదనపల్లెలో ఐదు నామినేషన్లు దాఖలు

మదనపల్లె టౌన, ఏప్రిల్‌ 22: మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల నామినేషన ప్రక్రియలో నాలుగో రోజున ఐదు నామినే షన్లు దాఖలు అయ్యా యి. సోమవారం రిటర్నింగ్‌ అధికారి హరి ప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నామినే షన ప్రక్రియలో వైసీపీ అభ్యర్థి నిస్సార్‌అ హ్మద్‌, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి మల్లెల పవన కుమార్‌ వేర్వేరుగా వెళ్లి నామినే షన వేశారు. వారితో పాటు స్వతంత్య్ర అభ్యర్థులుగా మదనపల్లె పట్టణానికి చెందిన మణి శంకర్‌, వి.ఉమాదేవి, మదనపల్లె మండలం కొత్తిండ్లు పంచాయతికి చెందిన నర సింహనాయక్‌ నామినేషన్లు దాఖలు చేశారు. డీఎస్పీ ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో వనటౌన, టు టౌన, తాలూకా సీఐలు వల్లీబషు, యువరాజు, శేఖర్‌ ఆధ్వర్యంలో పోలీ సులు బందోబస్తు నిర్వహించారు.

తంబళ్లపల్లెలో: తంబళ్లపల్లె శాసనసభ నియోజక వర్గానికి సోమవారం ఐదు నామి నేషన్లు దాఖలైనట్లు ఆర్వో రాఘవేంద్ర తెలి పారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎంఎన చంద్రశే ఖర్‌రెడ్డి, ఇండిపెండెంట్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా భానుచంద్రారెడ్డి ఒక్కొక్క సెట్టు ఇండిపెం డెంట్‌ అభ్యర్థిగా జి.కృష్ణప్ప నామినేషన పత్రా లను తంబళ్లపల్లె రిటర్నింగ్‌ అధికారి కార్యాల యంలో ఆర్వో రాఘవేంద్రకు అందజేశారు. అదేవి ధంగా వైసీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మూడో సెట్‌ నామినేషన పత్రాలను ప్రతిపాదకుడు ఖలీల్‌ అహమ్మ ద్‌ ఆర్వోకు అందజేశారు.

పీలేరులో: పీలేరు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ తరపున బాలిరెడ్డి సోమశేఖర రెడ్డి సోమవారం నామినేషన దాఖలు చేశారు. పీలేరులోని ఆర్‌వో కార్యా లయంలో ఆయన తన నామినేషన పత్రాలను ఆర్‌వో ఫర్మాన అహ్మద్‌కు అంద జేశా రు. నామినేషన అనంతరం ఆయన విలేఖ రులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశకు ప్రత్యే క హోదా రావాలన్నా, పోలవరం పూర్తి కావా లన్నా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, కడప స్టీలు ప్లాంటు కల సాకారం కావాలన్నా కాంగ్రెస్‌ పార్టీ అధికారం లోకి రావాలన్నారు. తమ నాయకుడు రాహుల్‌ గాంధీ పట్ల దేశవ్యాప్తం గా అనుకూల పవనాలు వీస్తున్నాయని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆయన ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. పీలేరులో తనను ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated Date - Apr 22 , 2024 | 11:52 PM