Share News

ఉత్కంఠ పోరులో విజయం

ABN , Publish Date - Jun 05 , 2024 | 12:12 AM

మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే ఫలితాల వెల్లడిలో క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఎం.ఎ్‌స.రాజు నియోజకవర్గాన్ని సుడిగాలిలా చుట్టేశారు. తన వాక్‌ధాటితో ఓటర్లను ఆకట్టుకున్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి సారథ్యంలో కేవలం 20 రోజుల ప్రచార కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నిర్వహించింది.

ఉత్కంఠ పోరులో విజయం
ఎం.ఎ్‌స.రాజు

మడకశిరటౌన, జూన 4: మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే ఫలితాల వెల్లడిలో క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఎం.ఎ్‌స.రాజు నియోజకవర్గాన్ని సుడిగాలిలా చుట్టేశారు. తన వాక్‌ధాటితో ఓటర్లను ఆకట్టుకున్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి సారథ్యంలో కేవలం 20 రోజుల ప్రచార కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నిర్వహించింది. వైసీపీలో ఏకనాయకత్వం లేకపోవడంతో పరాజయాన్ని స్వీకరించక తప్పలేదు. ఎం.ఎ్‌స.రాజును నానలోకల్‌ అంటూ ఎన్ని రకాలుగా దుష్ప్రచారం చేసినా ప్రజలు వాటిని నమ్మలేదు. చివరకు 399 ఓట్ల ఆధిక్యతతో వైసీపీ అభ్యర్థి ఈరలక్కప్పపై విజయాన్ని కట్టబెట్టారు. దీంతో మడకశిర నియోజకవర్గం వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయ సంబరాల్లో మునిగిపోయారు.

కలిసి వచ్చిన పోస్టల్‌ బ్యాలెట్‌

మడకశిర నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ మధ్య పోరు నువ్వా నే నే అనేలా సాగింది. 18 రౌండ్ల కౌంటింగ్‌ పూర్తయ్యే సరికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం.ఎ్‌స.రాజు కేవలం 25 ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. ఈసందర్భంగా 36వ కేంద్రం, 131వ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలు మొరాయించాయి. చివరిలో ఉత్కంఠ నెలకొనడంతో వైసీపీ నాయకులు కౌంటింగ్‌కు పట్టుబట్టారు. 36వ కేంద్రంలో వైసీపీ కన్నా బీఎ్‌సపీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో వీవీప్యాట్‌లను లెక్కించాలని ఈవీఎం పనిచేయడం లేదని వైసీపీ వారు కోరడంతో కలెక్టర్‌ సమక్షంలో లెక్కించారు. ఈతరుణంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు కీలకంగా మారాయి. పోస్టల్‌ బ్యాలెట్‌కు సం బంధించి టీడీపీ అభ్యర్థి ఎం.ఎ్‌స.రాజుకు 722 రాగా, వైసీపీ అభ్యర్థి ఈరలక్కప్పకు 498 ఓట్లు వ చ్చాయి. దీంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 224 ఓట్ల ఆధిక్యతను లభించింది. దీంతోపాటు రెండు ఈవీఎంలలో సైతం కొంత మెజార్టీ రావడంతో అధిక్యత 319కి పెరిగి, విజయం సాధించారు.

Updated Date - Jun 05 , 2024 | 12:12 AM