Share News

జగన్‌కు ఓటుతో బుద్ధి చెప్పండి

ABN , Publish Date - Apr 16 , 2024 | 02:43 AM

కుట్రలు, కుతంత్రాలతో పాలన సాగించిన సీఎం జగన్‌కు ఓటు అనే ఆయుధంతో పోటు పొడవాలని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో

జగన్‌కు ఓటుతో బుద్ధి చెప్పండి

ఆయన పాలనంతా విధ్వంసమే: బాలకృష్ణ

స్వర్ణాంధ్ర సాకార యాత్ర

నందికొట్కూరు ఏప్రిల్‌ 15: కుట్రలు, కుతంత్రాలతో పాలన సాగించిన సీఎం జగన్‌కు ఓటు అనే ఆయుధంతో పోటు పొడవాలని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో కోడి కత్తి నాటకం, ఆపై బాబాయికి గొడ్డలిపోటుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఈ సారి ఎన్నికల్లో గులకరాయి దెబ్బతో మరోసారి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చేందుకు డ్రామాలు ఆడుతున్నాడన్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా ఆయన సోమవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు, కర్నూలు నగరంలో రోడ్‌షో నిర్వహించారు. బాలయ్యను చూసేందుకు రెండు జిల్లాల నుంచి ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నందికొట్కూరు పట్టణంలోని పటేల్‌ సెంటర్‌లో ప్రజలను ఉద్దేశించి బాలకృష్ణ మాట్లాడారు. ఒక్క చాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ రాష్ట్రంలో విధ్వంస పాలన సాగించాడన్నారు. బాబాయ్‌ను చంపిన హంతకుడిని కాపాడుతూ మరో చెల్లికి ద్రోహం చేశాడన్నారు. వీరందరికీ సమాధానం చెప్పేందుకు జగన్‌ సిద్ధమా? అని బాలకృష్ణ సవాల్‌ విసిరారు. నాడు ఎన్టీరామారావు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను కూడా రద్దు చేసిన నిరంకుశ సీఎం జగన్‌ను ఇంకేమనాలన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే అంబేడ్కర్‌ విదేశీ విద్యను కొనసాగిస్తామన్నారు. ప్రతి ఎస్సీ కుటుంబానికి 2 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇస్తామన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం నాడు ఎన్టీఆర్‌ ఉర్దూను రెండో అధికారభాషగా గుర్తించారని బాలకృష్ణ పేర్కొన్నారు. దుల్హన్‌ పథకం ద్వారా రూ.50 వేలు లక్ష రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. మైనార్టీ కార్పొరేషన్‌కు ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. అమరావతిలో ఇస్లామిక్‌ సెంటర్‌ ఏర్పాటుకు 5ఎకరాల భూమి కేటాయిస్తామన్నారు. ముస్లింలకు 3 ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ, మున్సిపాల్టీల్లో చైర్మన్‌ పదవులను కేటాయిస్తామన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 02:43 AM