Share News

బతుకు భద్రతకై ఉద్యమించాలి : కేవీపీఎస్‌

ABN , Publish Date - May 29 , 2024 | 11:59 PM

సామాజిక వృత్తుల బతుకు భద్రతకై ఉద్యమించాలని కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎస్‌ రాధాకృష్ణ పిలుపునిచ్చారు.

 బతుకు భద్రతకై ఉద్యమించాలి : కేవీపీఎస్‌

ఎమ్మిగనూరు, మే29: సామాజిక వృత్తుల బతుకు భద్రతకై ఉద్యమించాలని కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎస్‌ రాధాకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని కేవీపీఎస్‌ కార్యాలయంలో సంఘం జిల్లా ఆఫీస్‌ బేరర్ల సమావేశం జిల్లా అధ్యక్షుడు దేవసహాయం అధ్యక్షత నిర్వహించారు. రాధాకృష్ణ, ప్రధానకార్యదర్శి ఎండీ ఆనంద్‌ బాబు మాట్లాడుతూ ఎవరు అధికారంలోకి వచ్చినా దళితుల సమస్యల పట్ల వారికుండే చిత్తశుద్ధిని బట్టి పోరాటాన్ని ఎంచుకోవాలన్నారు. సమాజానికి అనేకరకాలుగా ఉపయోగపడుతున్న సామాజిక వృత్తులైన డప్పు, చర్మం, కాటికాపరి, సఫాయి, తుంబర, ఉరుములాంటి వాటిని వృత్తులు ఎంచుకొని పనిచేసేవారి సమస్యల పరిష్కారం కోసం పాలకవర్గాల కృషి నామమాత్రంగానే ఉందన్నారు. జూన్‌ 15న డప్పు కళాకారుల సమావేశం కర్పూలులోను, జూన్‌ 17న కాటి కాపరుల సమావేశం ఆదోనిలోను, 19న చర్మకార వృత్తిదారుల సమావేశం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.

Updated Date - May 29 , 2024 | 11:59 PM