Share News

డబుల్‌ రోడ్డుకు మోక్షం ఎప్పుడో..?

ABN , Publish Date - May 21 , 2024 | 11:42 PM

ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా నిమ్మన పల్లె-కందూరు డబుల్‌ రోడ్డుకు మోక్షం కలిగే పరిస్థితి కనిపించడం లేదు.

డబుల్‌ రోడ్డుకు మోక్షం ఎప్పుడో..?
మాచిరెడ్డిగారిపల్లె సమీపంలో గుంతలు పడిన రోడ్డుపై వాహనదారుల పాట్లు

గుంతలు పడిన రోడ్డుపై ప్రయాణించాలంటే హడలుతున్న జనం దుస్థితిలో నిమ్మనపల్లె-కందూరు రోడ్డుమార్గం

నిమ్మనపల్లి, మే 21: ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా నిమ్మన పల్లె-కందూరు డబుల్‌ రోడ్డుకు మోక్షం కలిగే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వాహనదారులు, సింగల్‌ రోడ్డులో రాకపోకలు సాగించేం దుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు నిత్యం ప్రమా దాలు జరిగి ఎంతో మంది క్షతగాత్రులుగా మారుతుంటే కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు నెలల క్రితం ఓ మినీ బస్సు ఆటోను ఢీ కొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అం తే కాకుండా ఏడాదికి దాదాపు 10మందికి పైగా రోడ్డు ప్రమాదాలకు గువుతున్నారు. గత ప్రభుత్వంలో ఆచార్లపల్లె నుంచి చల్లావారిపల్లె వరకు డబల్‌ రోడ్డు పనులు చేపట్టారు. మిగిలిన 20కిలో మీటర్లు డబల్‌ రోడ్డు వేయాల్సి వుండగా దానిని పట్టించుకోలేదు. నాయకులు, అధికారులు మారినప్పటికి డబల్‌ రోడ్డుపై కేవలం ప్రకటనలు చేస్తు న్నారే తప్ప రోడ్డు వేసిన పాపాన పోలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ముష్టూరు పంచాయతి వలసపల్లె నుంచి బాహుదా ప్రాజెక్టుకు ఉన్న 2కిలో మీటర్లు మట్టి రోడ్డును కూడా గాలికి వదిలేశారు. ప్రస్తుతం మదనపల్లె నుంచి కందూరుకి వెళ్లాలంటే సింగల్‌ రోడ్డులో గుంతల మయం కావడంతో వాహన దారులు ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. దీనికి తోడు నిత్యం మండలంలోని రైతులు పండించిన టమోటా పంటను అమ్మాలంటే మదనపల్లె మార్కెట్‌కు తరలించాలి. గుంతలు పడిన రోడ్డులో ప్రయా ణించేందుకు దాదాపు రెండు గంటల పాటు పడుతుందని ఏ సమ యంలో ఏం జరుగుతుందో తెలియరాని పరిస్థితి. అంతే కాకుండా నిమ్మనపల్లె నుంచి తిరుపతి, కలికిరి, సదుం, పుంగనూరులకు దారు లు ఉన్నా రోడ్డు సక్రమంగా లేక బస్సులు నడవడం లేదు. ప్రమా దాలు జరిగితే 108 వాహనంలో మదనపల్లెకు వెళ్లాలంటే మార్గ మద్యంలోనే ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పాలకులు కూడా అధికారం వచ్చిన వెంటనే డబల్‌ రోడ్డు పనులు నిర్మిస్థామని వాగ్దానాలు చేసి వాటిని మరచిపోయారు. ఇలా అయితే రోడ్డుపై ప్రయాణం సాగించాలన్నా ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురువతున్నారు. కనీసం వచ్చే ప్రభుత్వం అయినా గుంతల మయంగా ఉన్న నిమ్మనపల్లె- కందురూ మార్గాన్ని డబల్‌ రోడ్డు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - May 21 , 2024 | 11:42 PM