Share News

మోసాల ప్రభుత్వం పోయింది

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:35 PM

కుట్రలు, కుతంత్రాలతో సాగిన ఐదేళ్ల మోసాల ప్రభుత్వం పోయి మాట నిలబెట్టుకునే చంద్రన్న వచ్చారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అనంతపురంలోని తన నివాసంలో సోమవారం ఆమె విలేకరులతో సమావేశంలో మాట్లాడారు.

మోసాల ప్రభుత్వం పోయింది
మాట్లాడుతున్న ఎమ్మెల్యే పరిటాల సునీత

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత

అనంతపురం, జూన 17(ఆంధ్రజ్యోతి): కుట్రలు, కుతంత్రాలతో సాగిన ఐదేళ్ల మోసాల ప్రభుత్వం పోయి మాట నిలబెట్టుకునే చంద్రన్న వచ్చారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అనంతపురంలోని తన నివాసంలో సోమవారం ఆమె విలేకరులతో సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగానే ఐదు కీలక హామీలు నెరవేరుస్తూ సీఎం చంద్రబాబు ఐదు సంతకాలు చేశారని అన్నారు. బాధ్యతలు చేపట్టిన రోజు నుంచేహామీలను నెరవేర్చడం ప్రారంభించారని అన్నారు. నిరుద్యోగుల ఆశలను నెరవేరుస్తూ ఏకంగా 16,347 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేలా మెగా డీఎస్సీపై సంతకం చేశారని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని అన్నారు. ఏటా డీఎస్సీ, జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని హామీ ఇచ్చిన జగన రెడ్డి ఒక్క పోస్టు, ఒక్క క్యాలెండర్‌ ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. ప్రజల భూములకు రక్షణ లేకుండా జగనరెడ్డి తీసుకొచ్చిన నల్ల భూహక్కు చట్టాన్ని రద్దు చేస్తూ చంద్రబాబు రెండో సంతకం చేశారని అన్నారు. అవ్వాతాతలకు ఇచ్చిన హామీ మేరకు పింఛన మొత్తాన్ని రూ.4 వేలకు పెంచారని అన్నారు. 2019లో చంద్రబాబు పింఛన రూ.2 వేలు చేశారని, ఇప్పుడు 66 లక్షల మందికి రూ.4 వేలు చొప్పున ఏప్రిల్‌ నుంచే ఇస్తారని అన్నారు. నిరుద్యోగుల నైపుణ్య గణన కోసం నాలుగో సంతకం, పేదలకు రూ.5కు నాణ్యమైన భోజనం అందించేందుకు అన్న క్యాంటిన్లను పునః ప్రారంభిస్తూ ఐదో సంతకం చేశారని అన్నారు. అన్న క్యాంటీనలను జగనరెడ్డి కక్షపూరితంగా మూసివేయించారని, కానీ పేదల ఆకలిని గుర్తించిన చంద్రబాబు వాటిని తెరిపిస్తున్నారని అన్నారు. వైసీపీ విధ్వంసాల పాలన ముగిసిందని, ఇక నుంచి ప్రజలు మెచ్చే విధంగా పాలన సాగుతుందని అన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 11:35 PM