మైనార్టీ యువతకు ఉచిత శిక్షణ
ABN , Publish Date - Dec 28 , 2024 | 05:15 AM
పారిశ్రామిక రంగంలో ఉపాధి, స్వయం ఉపాధికి ఇస్తున్న ఉచిత శిక్షణకు రాష్ట్రంలోని మైనార్టీలకు చెందిన యువత దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ కోరారు.

దరఖాస్తు చేసుకోవాలన్న మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక రంగంలో ఉపాధి, స్వయం ఉపాధికి ఇస్తున్న ఉచిత శిక్షణకు రాష్ట్రంలోని మైనార్టీలకు చెందిన యువత దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ కోరారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవల్‌పమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్(సీడా్‌ప) నిర్వహణలో ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు సరిపోలని నైపుణ్యాలు ఉన్న వారికి, నాణ్యమైన రెసిడెన్షియల్ శిక్షణలను ఉచితంగా అందించి స్కిల్ గ్యాప్‌ను భర్తీ చేస్తుందని తెలిపారు. ఉద్యోగ నియామకాలు, పోస్ట్ జాబ్ ప్లేస్‌మెంట్‌కు మద్దతు కూడా ఉంటుందని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న మైనార్టీల సంక్షేమ, మైనార్టీ ఫైనాన్స్ కార్యాలయాల్లో తమ దరఖాస్తు ఫారాలను అందించాలని మంత్రి ఫరూక్ కోరారు.