Share News

Ambati Rambabu: మంత్రి అంబటికి ఘోర అవమానం.. చెప్పుతో కొట్టాలంటూ మండిపడ్డ జనాలు

ABN , Publish Date - Jan 05 , 2024 | 10:07 PM

ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు ఘోర అవమానం జరిగింది. పల్నాడు జిల్లా ముప్పాళ్లలో ఆయనకు తీవ్రస్థాయిలో నిరసన సెగ తగిలింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మన్సూర్ అలీ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు..

Ambati Rambabu: మంత్రి అంబటికి ఘోర అవమానం.. చెప్పుతో కొట్టాలంటూ మండిపడ్డ జనాలు

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు ఘోర అవమానం జరిగింది. పల్నాడు జిల్లా ముప్పాళ్లలో ఆయనకు తీవ్రస్థాయిలో నిరసన సెగ తగిలింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మన్సూర్ అలీ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు.. మంత్రికి ఈ ఊహించని పరిణామం ఎదురైంది. ఈ కేసులో తమకు ఇంతవరకూ న్యాయం జరగలేదని, అప్పుడెప్పుడో రోడ్డు ప్రమాదం జరిగితే మంత్రి వచ్చేది ఇప్పుడా? అంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆయన్ను నిలదీశారు. ముప్పాళ్లలో తాము లేకపోతే వైసీపీనే లేదని, ఓట్లు వేసి ఆ పార్టీని తాము గెలిపించామని.. మంత్రి ఇప్పుడెందుకు వచ్చాడంటూ ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.


ఈ వీడియో తీసిన ఒక వ్యక్తి అయితే మంత్రి అంబటిపై తారాస్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇంతలో పోలీసులు వచ్చి నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా.. ‘మీకు తెలీదు, మేము ఓట్లేసి గెలిపించాం, మాట్లాడాల్సిందే, ఇప్పుడెందుకు వచ్చాడు, మనిషి చనిపోయాడా మంత్రి రావడం ఏంటి’ అంటూ ధ్వజమెత్తాడు. ఇంకోసారి వస్తే చెప్పులతో కొట్టాలంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇలా మంత్రిపై చుట్టుపక్కల వాళ్లు విమర్శలు ఎక్కుపెడుతుండగా.. గుంపులో నుంచి ఒకరు బూతుపురాణం సంధించారు. ఓవైపు పోలీసులు మృతుడి బంధువుల్ని సర్దిచెప్పేందేకు విశ్వ ప్రయత్నాలు చేసినా.. మరోవైపు వాళ్లు వినిపించుకోకుండా నిప్పులు చెరిగారు. దీంతో.. మరో దారి లేక, తనకు జరిగిన ఈ అవమానాన్ని తట్టుకోలేక మంత్రి అంబటి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇదిలావుండగా.. ముప్పాళ్ల గ్రామానికి చెందిన మన్సూర్ అలీ అనే వ్యక్తి ఇటీవల మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను గ్రామస్థులు పట్టుకొని.. పోలీసులకు అప్పగించారు. అయితే.. ఆ డ్రైవర్‌ను స్టేషన్ బెయిల్‌పై వెంటనే విడుదల చేశారు. దీనిపై ఆగ్రహించిన గ్రామస్థులు.. 2 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ నేపథ్యంలోనే.. మన్సూర్ మృతదేహానికి నివాళులు అర్పించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మంత్రి అంబటి వచ్చారు. అయితే.. ఆయనకు అనూహ్యంగా ఈ చేదు అనుభవం ఎదురైంది.

Updated Date - Jan 05 , 2024 | 10:07 PM