మెప్మా ఆర్పీ ఉద్యోగుల ఉద్యమ బాట
ABN , Publish Date - Jan 09 , 2024 | 04:32 AM
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) రిసోర్స్‌పర్సన్స్ ఉద్యోగుల సంఘం హక్కుల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది.
ఫిబ్రవరి 5న చలో విజయవాడకు పిలుపు
అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) రిసోర్స్‌పర్సన్స్ ఉద్యోగుల సంఘం హక్కుల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. సోమవారం విజయవాడలో ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగ సంఘ విస్తృత సమావేశం నిర్వహించింది. తమ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 22న ప్రజాప్రతినిధులకు సామూహిక రాయబారాలు నిర్వహించాలని, ఈనెల 23 నుంచి 30 లోపు జిల్లా మెప్మా అధికారులకు, మున్సిపల్ అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఉద్యోగ కాలపరిమితి సర్క్యులర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఫిబ్రవరి 5న చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించింది. 16 ఏళ్లుగా పని చేస్తున్న వారిని, వారి కుటుంబాలను రోడ్డున పడేయాలని చూస్తోందని ఈ సందర్భంగా ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం(సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి మండిపడ్డారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి.లక్ష్మి తదితరులు ప్రసంగించారు.