Share News

మార్కెట్‌ యార్డు వ్యాపారి ఐపీ

ABN , Publish Date - May 25 , 2024 | 11:32 PM

ఆదోని మార్కెట్‌ యార్డులోని ఓ వ్యాపారి రూ.కోటి రూపాయలకు ఐపీ పెట్టినట్లు తెలుస్తోంది.

మార్కెట్‌ యార్డు వ్యాపారి ఐపీ

ఆదోని, మే 25: ఆదోని మార్కెట్‌ యార్డులోని ఓ వ్యాపారి రూ.కోటి రూపాయలకు ఐపీ పెట్టినట్లు తెలుస్తోంది. మార్కెట్‌ యార్డులో కమీషన్‌ ఏజెంట్‌తో పాటు బ్యాంకులకు కూడా ఐపీ నోటీసులు పంపించినట్లు సమాచారం. కమీషన్‌ ఏజెంట్‌లతో పాటు, బ్యాంకులకు కూడా ఈ నెల 22వ తేదీన ఐపీ నోటీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఐపీ పెట్టిన వ్యాపారి తన అన్న పేరుపై వ్యాపారం చేస్తుండటం విశేషం. దాదాపు రూ.కోటి రూపాయలకు పైగానే అప్పులు ఉన్నట్లు, వారందరికీ కూడా ఐపీ నోటీసులు పంపించినట్లు సమాచారం. ఐపీ నోటీసులు అందుకున్న వారు మాత్రం లోలోపలే బాధపడుతూ.. ఆ మొత్తాన్ని ఎలా రికవరీ చేయాలా అన్న ఆలోచనలో పడ్డారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి అయ్యిందని పేరు చెప్పని కమిషన్‌ ఏజెంట్లు వాపోతున్నారు. ఐపీ పెట్టేందుకు ముగ్గురు వ్యాపారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు రాజకీయవేత్తలుగా చాలామణి అవుతూ డబ్బు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కమిషన్‌ ఏజెంట్లు వాపోతున్నారు. వీరంతా పట్టణంలో లేకుండా ఉడాయించినట్లు తెలుస్తోంది. దీంతో అప్పులు ఇచ్చిన ఆసాములు, రైతులు లబోదిబోమంటున్నారు.

Updated Date - May 25 , 2024 | 11:32 PM