Share News

మంత్రాలయం మఠం హుండీ ఆదాయం రూ.2.72 కోట్లు

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:45 PM

రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.2,71,83,973 నగదు వచ్చినట్లు మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాస రావు, వెంకటేష్‌ జోషి తెలిపారు.

మంత్రాలయం మఠం హుండీ ఆదాయం రూ.2.72 కోట్లు

మంత్రాలయం, ఏప్రిల్‌ 30: రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.2,71,83,973 నగదు వచ్చినట్లు మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాస రావు, వెంకటేష్‌ జోషి తెలిపారు. మంగళవారం మార్చి 2 రోజులతో పాటు ఏప్రిల్‌ 30 రోజులకు సంబంధించిన 32 రోజుల హుండీని మఠం గురురాజాంగణ భవనంలో దేవదాయ శాఖ ఇన్స్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమరాల నిఘా మధ్య లెక్కించినట్లు తెలిపారు. రూ.2,71,83,973 నగదుతో పాటు 1.290 కేజీల వెండి, 41 గ్రాములు బంగారు, వివిధ దేశాల డాలర్లు వచ్చినట్లు చెప్పారు.

Updated Date - Apr 30 , 2024 | 11:45 PM