బద్రినారాయణుడిగా మలయప్ప
ABN , Publish Date - Oct 11 , 2024 | 06:42 AM
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గురువారం సూర్య, చంద్రప్రభ వాహనాలపై మలయప్ప స్వామి కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు.
నేటితో వాహనసేవలు పరిసమాప్తం
తిరుమల, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గురువారం సూర్య, చంద్రప్రభ వాహనాలపై మలయప్ప స్వామి కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్యలో సూర్యప్రభపై బద్రినారాయణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు. చిరుజల్లుల మధ్య వాహనసేవ వైభవంగా జరిగింది. స్వామి ఉత్సవమూర్తిని పటాటోపం నడుమ ఊరేగించాల్సి వచ్చింది. రాత్రి చంద్రప్రభ వాహనంపై మలయప్పస్వామి భక్తులను అనుగ్రహించారు. బ్రహ్సోతవాల్లో మరో ప్రధాన వాహనమైన మహా రథోత్సవం శుక్రవారం ఉదయం జరుగనుంది. రాత్రి అశ్వవాహనంతో బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు ముగుస్తాయి. శనివారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.