Share News

పేదల సంక్షేమం కోసం టీడీపీని గెలిపించండి

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:05 AM

రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమం, అభివృద్ధి కోసం టీడీపీ-జనసేనని గెలిపించాలని వాల్మీకిపురం మండల టీడీపీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు.

పేదల సంక్షేమం కోసం టీడీపీని గెలిపించండి
గొల్లపల్ల్లెలో బాబు షూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ ప్రచారంలో పాల్గొన్న టీడీపీ, జనసేన నాయకులు

వాల్మీకిపురం, మార్చి 5: రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమం, అభివృద్ధి కోసం టీడీపీ-జనసేనని గెలిపించాలని వాల్మీకిపురం మండల టీడీపీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. వాల్మీకిపురం మండలం గొల్లపల్లెలో బాబు షూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేపట్టి ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆలోచనలతో పొందుపరచిన బంగారం లాంటి ఆరు సంక్షే మ పథకాలను ఇంటింటా వివరిస్తూ టీడీపీ,జనసేన ఉమ్మడి ప్రభుత్వాం అధికారంలోకి రాగానే తప్పక అమలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం జగ న అబ ద్దపు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రానున్న 40రోజులు నాయకులు, కార్యకర్తలు చిత్తశు ద్ధితో కృషి చేసి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డిని తప్పక గెలిపించుకుంటా మన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వల్లిగట్ల వెంకటరమణ, జిల్లా పార్టీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వెంకటరమణ, టీడీపీ పీలేరు మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్‌ బాషా, రాజంపేట పార్లమెంట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రాజేంద్రాచారి, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు కోసూరి రమేష్‌, నాయ కులు పీవీ నారాయణ, చంద్రమౌళి, తెలుగు యువత చాను, కువైట్‌ సయ్యద్‌బాషా, డిష్‌ బ్రదర్స్‌, అడ్వకేట్‌ రమణ, స్వర్ణలత, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 12:05 AM