Share News

గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి

ABN , Publish Date - Feb 12 , 2024 | 11:52 PM

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న దేశ వ్యాప్తంగా తలపెట్టిన గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రామచంద్రయ్య పిలుపునిచ్చారు.

గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రామచంద్రయ్య

పత్తికొండ టౌన్‌, ఫిబ్రవరి 12: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న దేశ వ్యాప్తంగా తలపెట్టిన గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రామచంద్రయ్య పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సీఆర్‌ భవన్‌లో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రౌండుటేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గ అధ్యక్షుడు వీరన్న అధ్యక్షత వహించారు. సీపీఐ, టీడీపీ, లోక్‌సత్తా, ప్రజాసంఘాల నాయకులు హాజరై ప్రసంగించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రామచంద్రయ్య మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరింపజేస్తూ దేశంలో మతోన్మాదాన్ని పెంపొందిస్తూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి బడా పారిశ్రామికవేత్తలకు ఈ దేశ సంపదను దోచి పెడుతుందని విమర్శించారు. వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్‌, అటవీ సంపదలను, ఎల్‌ఐసీ, బ్యాంకులను కార్పొరేట్‌ శక్తులకు అప్పజెప్పడం దారుణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నాగేంద్రయ్య, జిల్లా ఉపాధ్యక్షులు రాజాసాహేబ్‌, టీడీపీ నాయకులు లక్ష్మినారాయణ, అశోక్‌ కుమార్‌, సీపీఎం నాయకులు వెంకటేశ్వరరెడ్డి, లోక్‌సత్తా పార్టీ నాయకులు జయరాం, సీపీఐ నాయకులు నబీ రసూల్‌, రామాంజనేయులు, సుల్తాన్‌,గురుదాస్‌, కారన్న, ఉమాపతి పాల్గొన్నారు.

ఆలూరులో రౌండ్‌టేబుల్‌ సమావేశం

ఆలూరు : ఆలూరు పట్టణంలో జ్యోతిబసు భవన్‌లో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణ అధ్యక్షతన ప్రజా సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు భూపేష్‌, సీపీఎం మండల కార్యదర్శి షాకీర్‌ మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రవాణా రంగం దేశవ్యాప్తంగా బంద్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ బంద్‌ జరుగుతుందన్నారు. ఈ బంద్‌కు అందరూ సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు. రైతు సంఘ నాయకులు ఈరన్న, గోపాల్‌, ఏఐటీయూసీ నాయకులు శివ, మైన, గోవర్థన్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 11:52 PM