Share News

‘జనచైతన్య’ డైరెక్టర్‌ మాదల శకుంతల కన్నుమూత

ABN , Publish Date - May 14 , 2024 | 02:55 AM

జనచైతన్య గ్రూపు సంస్థల డైరక్టర్‌, వ్యవస్థాపకురాలు మాదల శకుంతల (86) గుంటూరు రాజేంద్రనగర్‌లోని నివాసంలో సోమవారం కన్నుమూశారు. ఆ

‘జనచైతన్య’ డైరెక్టర్‌  మాదల శకుంతల కన్నుమూత


గుంటూరు, మే 13: జనచైతన్య గ్రూపు సంస్థల డైరక్టర్‌, వ్యవస్థాపకురాలు మాదల శకుంతల (86) గుంటూరు రాజేంద్రనగర్‌లోని నివాసంలో సోమవారం కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జనచైతన్య గ్రూపు సంస్థలను స్థాపించి, అభివృద్ధి చేయడంలో ఆమె కీలకభూమిక పోషించారు.

శకుంతల భౌతిక కాయాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు, పుర ప్రముఖులు సందర్శించి ఘన నివాళులర్పించారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు గుంటూరు స్తంభాలగరువులోని మహా ప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరుపనున్నట్టు కుమారులు తెలిపారు.

Updated Date - May 14 , 2024 | 02:55 AM