Share News

సాఫ్‌నెట్‌ చైర్మన్‌గా మాచాని వెంకటేష్‌

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:31 AM

సొసైటీ ఫర్‌ ఆంధ్రప్రదేశ్‌ నెట్‌ వర్క్స్‌ చైర్మన్‌( సాఫ్‌నెట్‌)గా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన మాచాని వెంకటేష్‌ను నియమిస్తు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

సాఫ్‌నెట్‌ చైర్మన్‌గా మాచాని వెంకటేష్‌

ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 19: సొసైటీ ఫర్‌ ఆంధ్రప్రదేశ్‌ నెట్‌ వర్క్స్‌ చైర్మన్‌( సాఫ్‌నెట్‌)గా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన మాచాని వెంకటేష్‌ను నియమిస్తు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో మాచాని వెంకటేష్‌ను ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయ కర్తగా ప్రకటించింది. అయితే పార్టీ జరిపిన సర్వేలో మాచాని వెంకటేష్‌కు అనుకూలంగా రాలేదు. దీంతో మాచాని వెంకటేష్‌ స్థానంలో కొత్త ఇన్‌చార్జీగా మాజీ ఎంపీ బుట్టా రేణుకను ప్రకటించడంతో పాటు మాచాని వెంటేష్‌కు రాష్ట్ర స్థాయి చైర్మన్‌గా నియమిస్తామని హామీ ఇచ్చింది. దీంతో నేడు మాచాని వెంకటేష్‌ను సాప్‌నెట్‌ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేయడంతో ఆయన వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది.

Updated Date - Feb 20 , 2024 | 12:31 AM