Share News

రైలు పట్టాలపై ఆగిన లారీ

ABN , Publish Date - Dec 28 , 2024 | 04:13 AM

Lorry Stalls on Railway Tracks in Chakarlapalli

  రైలు పట్టాలపై ఆగిన లారీ

శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాకర్లపల్లి రైల్వే గేటు వద్ద శుక్రవారం ఓ లారీ పట్టాలపై ఆగిపోయింది. మంగళూరు నుంచి తాడిపత్రి వెళ్తున్న లారీ చాకర్లపల్లి గేటు వద్దకు వచ్చేసరికి బ్యాటరీలో లోపంతో ఆగిపోయింది. రైల్వే సిబ్బంది ట్రాక్‌పై ప్రమాద హెచ్చరిక ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళుతున్న కర్ణాటక ఎక్స్‌ప్రె్‌సను రంగేపల్లి స్టేషన్‌లో ఆపేశారు. రాజ్‌కోట్‌ వెళ్తున్న మరో ఎక్స్‌ప్రె్‌సనూ కాసేపు ఆపారు. ఎట్టకేలకు బ్యాటరీని సరిచేయడంతో లారీ అక్కడి నుంచి కదిలింది. ఈ ఘటనపై లారీ డ్రైవర్‌ హరీశ్‌, ఓనర్‌పై కేసు నమోదు చేశామని ఆర్పీఎఫ్‌ ఎఎ్‌సఐ శీనప్ప చెప్పారు.

- సోమందేపల్లి, ఆంధ్రజ్యోతి

Updated Date - Dec 28 , 2024 | 04:13 AM