ఫోన్ మాట్లాడుతూ..లారీకి ఉరేసుకున్న డ్రైవర్
ABN , Publish Date - Dec 17 , 2024 | 12:28 AM
ఫోన్ మాట్లాడుతూనే తాను డ్రైవర్‌గా పని చేస్తున్న లారీకే ఉరి వేసుకుని డ్రైవర్ ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.
ఏలూరు క్రైం, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఫోన్ మాట్లాడుతూనే తాను డ్రైవర్‌గా పని చేస్తున్న లారీకే ఉరి వేసుకుని డ్రైవర్ ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరా లివి.. పశ్చిమ బెంగాల్లోని కుర్చీ బీహార్ ప్రాంతా నికి చెందిన మహమ్మద్ రాజఉల్హక్(24) నాలు గు నెలల క్రితం ఏలూరుకు చెందిన కామినేని శ్రీనివాస్ అనే లారీ యజమాని వద్ద డ్రైవర్‌గా చేరాడు. ఏలూరు బైపాస్ రోడ్డు పోస్టల్ కాలనీ వద్ద లారీ ఆఫీస్‌లోనే ఉంటూ పశ్చిమ బెంగాల్ కు నిమ్మకాయల లోడ్లను వేసుకుని వెళ్ళి వస్తుం డేవాడు. అతనికి వివాహం కాలేదు. ఆదివారం రాత్రి ఆఫీసులో అందరి డ్రైవర్లతో పాటు నిద్రిం చాడు. అయితే రాత్రి 11 గంటల ప్రాంతంలో లేచి ఆ పక్కనే ఉన్న రోడ్డుపై పార్క్ చేసిన లారీ టాప్ ఎక్కి చాలా సమయం ఫోన్ మాట్లాడాడని అక్కడున్న వాచ్‌మెన్ చెబుతున్నాడు. తెల్లవారేట ప్పటికి ఆ లారీ టాప్‌కి పొడవాటి టవల్‌తో ఉరి వేసుకుని కన్పించాడు. అతని చెవిలో ఇయర్ ఫోన్స్ అలానే ఉన్నాయి. ఈ సమాచారం అందు కున్న ఏలూరు త్రీటౌన్ సీఐ ఎస్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ జి.అజయ్‌కుమార్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనుమా నాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమి త్తం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. బంధు వులకు సమాచారం ఇచ్చారు.