Share News

ఏపీ ప్రజల ‘మన్‌కీబాత్‌’ వినండి

ABN , Publish Date - May 09 , 2024 | 03:55 AM

రాష్ట్రానికి పదేళ్లుగా ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేశారు. పో లవరం రివర్స్‌ టెండర్‌ను అడ్డుకోకుండా ప్రాజె క్టు వినాశనానికి కారకులయ్యారు’’

ఏపీ ప్రజల ‘మన్‌కీబాత్‌’ వినండి

ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీకి ద్రోహం చేశారు

జగన్‌ రివర్స్‌ టెండర్‌ను అడ్డుకోకుండా పోలవరం వినాశనానికి కారకులయ్యారు

మోదీకి 10 ప్రశ్నలతో చార్జిషీట్‌

రేడియో పంపిన షర్మిల

అమరావతి/కడప, మే 8(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రానికి పదేళ్లుగా ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేశారు. పో లవరం రివర్స్‌ టెండర్‌ను అడ్డుకోకుండా ప్రాజె క్టు వినాశనానికి కారకులయ్యారు’’ అని ప్రధాని మోదీపై పీసీసీ చీఫ్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కడపలో ఆమె మాట్లాడారు. ‘‘ప్రధాని మన రాష్ట్రానికి మళ్లీ మళ్లీ వస్తున్నా రు. ఎన్నికల ప్రచారంపై బీజేపీ, మోదీ చూపిస్తున్న శ్రద్ధ రాష్ట్రంపై పెట్టలేదు. ఏపీ ప్రజలను ఓటువేసే యంత్రాలుగా చూస్తున్నారు. అందుకే ఏపీ ప్రజల మన్‌కీబాత్‌ వినాలంటూ రేడియో పంపిస్తున్నా’’ అన్నారు. ‘‘మీ దత్తపుత్రుడు అవినీతిపరుడు. కరప్షన్‌లో జగన్‌ టాప్‌ అని అంటు న్నారు. పదేళ్లలో మీకు అదేమీ కనబడలేదా? రాష్ట్రంలో లిక్కర్‌ మాఫియా ఉందని తెలిసినా, మీరు గాడిదలు కాశారా? వివేకా హత్యలో అవినాశ్‌రెడ్డిని కర్నూలులో అరెస్టు చేయాలని చూసి న సీబీఐని తన్ని తరిమివేశారు. అప్పుడేం చేస్తున్నారు? అరెస్టు కాకుండా అడ్డుకున్నది మీరు. మీ దత్త పుత్రుడికి మద్దతుగా ఉన్నది మీరు.. మీకు ఈ రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కు లేదు’’ అని షర్మిల మండిపడ్డారు. ‘‘రాష్ట్ర ప్రజల పక్షాన మీకు చార్జిషీట్‌ పంపుతున్నాం. పదేళ్లలో మీరు చేసిన మోసానికి 10 ప్రశ్నలు పంపుతున్నాం. ముందుగా వాటికి సమాధానం చెప్పండి’’ అని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 1) ప్రత్యేక హోదాపై మాటమార్చి వెన్నుపోటు పొడిచారు. 2) జగన్‌ రివర్స్‌ టెండరింగ్‌ను అడ్డుకోకుండా పోలవరం వినాశనానికి నాంది పలికారు. 3) అమరావతి రాజధాని పూర్తికాలేదు. 4) విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారు. 5) కడప స్టీలు ప్లాంటు, విశాఖ జోన్‌ వంటి విభజన హామీలను తుంగలో తొక్కారు. 6) మీ దత్తపుత్రుడు మద్యం సిండికేట్‌ నడుపుతూ కల్తీ మద్యం తో మనుషుల ప్రాణాలు తీస్తున్నా మీరు పలకలేదు. 7) ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్‌ అంతం చేయడానికి పూనుకున్నారు. 8) ఇసుక, మద్యం, ఖనిజాలు, అక్రమ కాంట్రాక్టులు, దొంగదారిలో రాష్ట్రం చేస్తున్న అప్పులు, కేంద్ర నిదుల మళ్లింపు.. అయినా చర్యలు లేవు. 9) కర్నూలులో అవినాశ్‌ను అరెస్టు చేయడం చేతకాక సీబీఐ వెనుతిరగడంలో అర్థమేంటి? 10) ఏటా 2కోట్ల ఉద్యోగాలిస్తామన్న మాట ఏమైంది. ఈ పది అంశాలకు సమాధానం చెప్పండి అని షర్మిల డిమాండ్‌ చేశారు.

రాజధాని ఏదంటే ఏం చెబుతావు?: జగన్‌కు నవ సందేహాలతో షర్మిల లేఖ

‘‘ఏపీకి రాజధాని ఉందా సీఎం గారూ? ఉంటే ఏదని అడిగితే ఏం సమాధానం చెబుతారు’’ అని జగన్‌ను షర్మిల నిలదీశారు. రాజధాని అంశంపై నవ సందేహాలు పేరిట జగన్‌కు లేఖరాశారు. 1)రాష్ట్రానికి రాజధాని ఏదీ? 2)అమరావతిని ప్రతిపక్ష నేతగా అంగీకరించి న తమరు అధికారంలోకి వచ్చాక ఎందుకు వ్యతిరేకించారు. 3)గత ఎన్నికలకు ముందు ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నానంటూ చెప్పిన మాట వాస్తవం కాదా? 4) రాజధాని అమరా వతిలోనే ఉండాలని హైకోర్టు చెప్పినా పట్టు దల ఎందుకు? 5) తమరి సహాయ నిరాకరణ వల్లే అమరావతికి మెట్రోరైలు, రో డ్లు ఆగిపోవడం నిజం కాదా? 6) రైతులు నాలుగున్నరేళ్లుగా ఉద్యమిస్తుంటే చర్చలు జరిపే కనీస బాధ్యత మీకు ఉండదా? 7) రాజధాని రైతుల బాధ్యత విస్మరించిన తమ రిని ఎందుకు గద్దె దింపొద్దంటారు? 8) అమరావతి నుంచి కార్యాలయాలను విశాఖ కి తరలించవద్దన్నా తరలిస్తున్నది నిజం కా దా? 9)రాజధానిపై మాట తప్పానని భావి స్తే.. ఓటు వేయవద్దని ప్రజలకు చెప్పగలరా?

Updated Date - May 09 , 2024 | 03:55 AM