Share News

అయోధ్య ఆలయ ప్రతిష్ఠ వేళ మసీదుల్లోనూ దీపాలు పెట్టండి

ABN , Publish Date - Jan 11 , 2024 | 03:54 AM

దేశంలోని 140 కోట్ల మంది ప్రజల డీఎన్‌ఏ ఒకటేనని, హిందువులు, ముస్లింలు సోదరులని బీజేపీ జాతీయ మోర్చా అధ్యక్షుడు జమాల్‌ సిద్ధిఖి పేర్కొన్నారు.

అయోధ్య ఆలయ ప్రతిష్ఠ వేళ మసీదుల్లోనూ దీపాలు పెట్టండి

బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్‌ సిద్ధిఖి

బెంగళూరు, జనవరి 10(ఆంధ్రజ్యోతి): దేశంలోని 140 కోట్ల మంది ప్రజల డీఎన్‌ఏ ఒకటేనని, హిందువులు, ముస్లింలు సోదరులని బీజేపీ జాతీయ మోర్చా అధ్యక్షుడు జమాల్‌ సిద్ధిఖి పేర్కొన్నారు. అయోధ్యలో శ్రీరామచంద్రుడి మూర్తులను ప్రతిష్ఠించే వేళ మసీదులు, దర్గాలలో కనీసం ఐదు దీపాలను ఈ నెల 22న సాయంత్రం వెలిగించాలని ఆయన ముస్లింలకు పిలుపునిచ్చారు. ఇది హిందూ-ముస్లింల మధ్య సామరస్యాన్ని ఎన్నో రెట్లు పెంచుతుందని తెలిపారు. బీజేపీ మైనార్టీ మోర్చా కార్యకర్తలు మసీదులు, దర్గాల కమిటీ పెద్దలను ఇందుకు ఒప్పించే ప్రయత్నం చేస్తారని, అయితే ఎక్కడా బలవంతం ఉండదని అన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 08:01 AM