పర్యావరణాన్ని కాపాడుకుందాం
ABN , Publish Date - Nov 13 , 2024 | 12:12 AM
మొక్కలు నాటి పర్యావరణా న్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందని టీడీపీ బనగానపల్లె నియోజకవర్గం నాయకురాలు బీసీ ఇందిరమ్మ అన్నారు.

బనగానపల్లె, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మొక్కలు నాటి పర్యావరణా న్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందని టీడీపీ బనగానపల్లె నియోజకవర్గం నాయకురాలు బీసీ ఇందిరమ్మ అన్నారు. మంగళవారం బనగానప ల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణంపై అవగాహన కల్పించారు. బనగానపల్లె- నాఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా కళాశాలలోని విద్యార్థులకు ప్లాస్టిక్ క్యారీబాగులు, ప్లాస్టిక్ గ్లాసులు, వస్తువుల వల్ల కలిగే న ష్టాలను వివరించింది. బనగానపల్లెను క్లీన ఆండ్ గ్రీనగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో విద్యార్థులు, వివిధ వ్యాపారులు, వివిధ వర్గాల ప్రజలతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ సత్యప్రపూర్ణ, , టంగుటూరు శ్రీనయ్య, టీచర్ నాగరాజు, అధ్యాపకులు కిశోర్ విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, బనగానపల్లె సీఐగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్‌కుమార్ మంగళవారం మంత్రి బీసీ జనార్దనరెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మను కలిశారు. ఆయన వెంట ఎస్‌ఐ దుగ్గిరెడ్డి తదితరులున్నారు. అలాగే మండలంలోని చెర్వుపల్లె గ్రామానికి చెందిన చాకలి సుబ్బరాయుడికి సొంత నిధులతో రూ.3వేలు పింఛన అందించారు.