Share News

వ్యవసాయ కూలీల రక్షణకు ఉద్యమిద్దాం

ABN , Publish Date - May 23 , 2024 | 11:56 PM

దేశంలో వ్యవసాయ కార్మికుల హక్కులు, రక్షణ కోసం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ పేర్కొన్నా రు.

వ్యవసాయ కూలీల రక్షణకు ఉద్యమిద్దాం
సమావేశంలో మాట్లాడుతున్న కార్మికసంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌

బి.కొత్తకోట, మే23: దేశంలో వ్యవసాయ కార్మికుల హక్కులు, రక్షణ కోసం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ పేర్కొన్నా రు. గరువారం బి.కొత్తకోట మండల పరిధిలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్‌లీహిల్స్‌లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు అధ్య క్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా జాతీయ ప్ర.కార్యదర్శి వెంక ట్‌ మాట్లాడుతూ వ్యవసాయ కూలీలు సాధించుకున్న పథకాలు రక్షించుకోవడం కోసం ఐక్య ఉద్యమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో అఖిలభారత సహాయకార్యదర్శి విక్రమ్‌సింగ్‌,రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ శ్రీనివాసులు, రవి, కేవి.నారాయణ, ఆంజినేయులు, నాగేశ్వరరావు, కళ్యాణ్‌, పుల్లయ్య, సింహాచలం, రాజు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2024 | 11:56 PM