ఆలూరును ఐక్యంగా అభివృద్ధి చేసుకుందాం
ABN , Publish Date - May 12 , 2024 | 12:29 AM
ఆలూరు అభివృద్ధి కోసం అందరూ ఐక్యంగా కదిలి టీడీపీకి ఓటు వేసి వేయించి నియోజకవర్గ అభివృద్ధి కోసం బాటలు వేద్దామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ అన్నారు.

వేదవతి ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు పారిద్దాం
గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
మేనిఫెస్టో మేరకు పథకాలు అందేలా చూస్తాం
వలసల నివారణకు ప్రణాళికలు
యువత ఉపాధి కోసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం
ఆలూరు టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్
హులేబీడు, తుంబళబీడు, మరకట్టులో ప్రచారం
మరకట్టు గ్రామంలో అవ్వను ఓటు అభ్యర్థిస్తున్న వీరభద్రగౌడ్
ఆలూరు, మే 11: ఆలూరు అభివృద్ధి కోసం అందరూ ఐక్యంగా కదిలి టీడీపీకి ఓటు వేసి వేయించి నియోజకవర్గ అభివృద్ధి కోసం బాటలు వేద్దామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారం ముగింపు కార్యక్రమంలో భాగంగా మండలంలోని హులేబీడు, తుంబళబీడు, మరకట్టు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వేదవతి, నగరడోణ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు పారించుకుందామన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలికంగా గ్రామాల్లో వేధిస్తున్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించు కుందామని పేర్కొన్నారు. ఆలూరు ప్రాంతంలో ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా ఎలెల్సీ, హెచ్‌ఎల్సీ, ఆలూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. సోమవారం జరగనున్న ఎన్నికల్లో తనను, కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజును ఆదరించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో సర్పంచి ఎల్లప్ప, వెంకటేశ్వర్లు, ఉసేని, దేవేంద్రప్ప, మద్దిలేటి, కేశన్న, ఉపేంద్ర, బాలరాజు, రాజశేఖర్, డేగులపాడు సర్పంచి నీలకంఠ, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, దేవేంద్ర, బలరాం, నాగరాజు, మహీధర్ రెడ్డి, రామంజనేయులు, ఉచ్చవీరప్ప, మూసనపల్లె నారాయణ పాల్గొన్నారు.