Share News

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:39 PM

పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరూ తమవంతు సహాకారం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ నాగరాజు పిలుపు నిచ్చారు. శుక్రవారం డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలోని తన ఛాంబరులో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం

పల్స్‌ పోలియో ఏర్పాట్లు పూర్తి

రేపు 0-5 సంవత్సరాల చిన్నారులకు టీకా వ్యాక్సిన్‌ పంపిణీ

జిల్లా వైద ్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ నాగరాజు

కడప(కలెక్టరేట్‌), మార్చి 1: పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరూ తమవంతు సహాకారం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ నాగరాజు పిలుపు నిచ్చారు. శుక్రవారం డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలోని తన ఛాంబరులో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమం ఈ నెల 3న జిల్లా వ్యాప్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని, 0-5 ఏళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేయుటకు 2029 పోలియో బూత్‌లు, 51 మొబైల్‌ బృందాలు పనిచేయనున్నాయన్నారు. 23 ట్రాన్స్‌విట్‌ పాయింట్స్‌ ద్వారా 8264 వ్యాక్సినేటర్స్‌, 203 రూట్‌ సూపర్‌వైజర్ల ద్వారా ఈ కార్యక్రమం విజయవంతం చేయుటకు ఏర్పాట్లు సిద్ధంం చేశామన్నారు. భారతదేశం పోలియో రహిత దేశంగా ప్రటించడం జరిగిందని, అయినప్పటికీ పొరుగు దేశం పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాల్లో పోలియో కేసులు ఉండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 2006 తరువాత పోలియో కేసుల నమోదు కాలేదన్నారు. వలసలు వచ్చిన వారు, భవన నిర్మాణ కార్మికులు, గ్రామాలకు దూరంగా నివసించే వారి పిల్లలతో పాటు పట్టణ మురికి వాడల్లో ఈ వ్యాక్సిన్‌ చిన్నారులకు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వందశాతం పోలియో చుక్కలు వేయుటకు సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లా టీకాల అధికారి డాక్టర్‌ ఉమామహేశ్వరకుమార్‌ మాట్లాడుతూ 0-5 ఏళ్ల చిన్నారులకు టీకా మందు అందించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్లు శశిభూషణ్‌రెడ్డి, రవిబాబు, రమేష్‌, సునీత, మాస్‌ మీడియా అధికారిణి భారతి, సహ మీడియా అధికారిణి రమణమ్మ, కమ్యూనిటీ ఆరోగ్య అధికారి మునిరెడ్డి, ఆరోగ్య విస్తరణ అధికారి రాధాకృష్ణ తదితరులు పాల్గొని పోస్టరును విడుదల చేశారు.

Updated Date - Mar 01 , 2024 | 11:39 PM