Share News

చండ్ర రాజేశ్వరరావు ఆశయాలు సాధిద్దాం

ABN , Publish Date - Apr 10 , 2024 | 12:29 AM

భూపోరాట యోధుడు సీపీఐ అగ్రనాయకులు అమరజీవి చండ్ర రాజేశ్వరరావు ఆశయ సాధన కోసం కృషి చేద్దామని సీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి భీమలింగప్ప అన్నారు.

చండ్ర రాజేశ్వరరావు ఆశయాలు సాధిద్దాం

పత్తికొండ టౌన్‌, ఏప్రిల్‌ 9: భూపోరాట యోధుడు సీపీఐ అగ్రనాయకులు అమరజీవి చండ్ర రాజేశ్వరరావు ఆశయ సాధన కోసం కృషి చేద్దామని సీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి భీమలింగప్ప అన్నారు. మంగళవారం స్థానిక సీఆర్‌ భవన్‌లో చండ్రరాజేశ్వరరావు 30వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపన్న కుటుంబంలో పుట్టిన చండ్ర రాజేశ్వరరావు పేదలు, అనగారిన వర్గాల కోసం ఎర్రజెండా చేతబూని యావదాస్తిని పేదలకు పంచిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను పేదలకు పంచి భూపోరాటాల ముద్దుబిడ్డగా పేరు గడించారని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నబీరసూల్‌, చేతివృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి కారన్న, సీపీఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, సీపీఐ నాయకులు సుంకన్న, మధు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2024 | 12:29 AM