Share News

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా లక్ష్మీశ

ABN , Publish Date - Nov 04 , 2024 | 03:52 AM

ఎన్టీఆర్‌, వైఎ్‌సఆర్‌ కడప జిల్లాలకు ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా లక్ష్మీశ

వైఎ్‌సఆర్‌ జిల్లాకు శ్రీధర్‌ నియామకం.. సీఎస్‌ ఉత్తర్వులు

అమరావతి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌, వైఎ్‌సఆర్‌ కడప జిల్లాలకు ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి లక్ష్మీశను, వైఎ్‌సఆర్‌ కడప జిల్లాకు 2006 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి సి.శ్రీధర్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా ఉన్న సృజన, వైఎ్‌సఆర్‌ జిల్లా కలెక్టర్‌గా ఉన్న శివశంకర్‌ తెలంగాణకు బదిలీ అయ్యారు. దీంతో వారి స్థానంలో కొత్త కలెక్టర్లను నియమించారు. లక్ష్మీశ ప్రస్తుతం ఏపీఎంఎ్‌సఐడీసీ ఎండీతో పాటు ఆరోగ్యశ్రీ సీఈవో, డ్రగ్స్‌ డీజీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించే వరకూ తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే కడప జిల్లా కలెక్టర్‌గా నియమితులైన శ్రీధర్‌ పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన బదిలీ కావడంతో పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా ఎం.అభిషేక్త కిశోర్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.

Updated Date - Nov 04 , 2024 | 03:52 AM