Share News

కురువల మద్దతు టీడీపీకే

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:25 AM

కురవ సామాజిక వర్గీయులను గుర్తించిన పార్టీ టీడీపీ అని, ఈ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతుతో టీడీపీ విజయం తథ్యమని టీడీపీ జిల్లా బీసీ సెల్‌ మెంబర్‌ ఎల్లార్తి కురవ దర్గన్న, తెలుగు యువత అధ్యక్షుడు ఎండీ హళ్లి కురవ నాగరాజు శనివారం అన్నారు.

కురువల మద్దతు టీడీపీకే

హొళగుంద, ఏప్రిల్‌ 13: కురవ సామాజిక వర్గీయులను గుర్తించిన పార్టీ టీడీపీ అని, ఈ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతుతో టీడీపీ విజయం తథ్యమని టీడీపీ జిల్లా బీసీ సెల్‌ మెంబర్‌ ఎల్లార్తి కురవ దర్గన్న, తెలుగు యువత అధ్యక్షుడు ఎండీ హళ్లి కురవ నాగరాజు శనివారం అన్నారు. స్థానిక సిద్దేశ్వర ఐస్‌ మిల్‌ వద్ద విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బళ్లారి మాజీ డిప్యూటీ మేయర్‌ శశికళ, ఆమె భర్త కృష్ణమోహన్‌ వైసీపీ తీర్థం పుచ్చుకొని, ఆలూరు నియోజకవర్గ కురవలు వైసీపీ కి మద్దతు తెలిపారంటూ అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని అన్నారు. ఆమె వెంట కురువలు ఎవరూ లేరని స్పష్టం చేశారు. మాజీ సర్పంచు కేబీ వీరభద్రప్ప, సీనియర్‌ నాయకులు గాది లింగ, ఎండీ హళ్లి వీరనాగప్ప, మార్లమాడికి నల్లారెడ్డి, ఎంపీటీసీ బసప్ప పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 12:25 AM