పెట్టుబడికి రెట్టింపు.. యాప్ టోకరా!
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:51 AM
పెట్టిన పెట్టుబడికి 54 రోజుల్లో రెట్టింపు ఇస్తామని ‘కోస్తా’ అనే యాప్ ప్రకటన చూసి స్టీల్‌ప్లాంటుకు చెందిన ఓ ఉద్యోగి డబ్బులు పెట్టారు. చెప్పినట్టుగానే నిర్వాహకులు వారం వారం డబ్బులు చెల్లిస్తూ వచ్చారు.

ఉక్కుటౌన్‌షి్‌ప(విశాఖపట్నం), డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): పెట్టిన పెట్టుబడికి 54 రోజుల్లో రెట్టింపు ఇస్తామని ‘కోస్తా’ అనే యాప్ ప్రకటన చూసి స్టీల్‌ప్లాంటుకు చెందిన ఓ ఉద్యోగి డబ్బులు పెట్టారు. చెప్పినట్టుగానే నిర్వాహకులు వారం వారం డబ్బులు చెల్లిస్తూ వచ్చారు. దీంతో తెలిసిన ఉద్యోగులతో అతను యాప్‌లో పెట్టుబడులు పెట్టించారు. వారం వారం నగదు చెల్లిస్తుండడంతో నమ్మకం కుదిరి ప్లాంటులో కీలక విభాగాలకు చెందిన ఉద్యోగులు భారీసంఖ్యలో ఈ యాప్‌లో పెట్టుబడులు పెట్టారు. మూడు వారాల క్రితం క్రిస్మస్ ఆఫర్‌గా 15 రోజుల్లోనే పెట్టుబడికి రెట్టింపు ఇస్తామని చెప్పడంతో కొంతమంది అప్పులు చేసి మరీ కట్టారు. అయితే వారం నుంచి ఆ యాప్ పనిచేయకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు స్టీల్‌ప్లాంటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం స్టీల్‌ప్లాంటు సీఐ కేశవరావు వద్ద ప్రస్తావించగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.