Share News

కొండకోనల్లో కోసిగి

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:20 AM

చుట్టూ కొండలు.. మధ్య పచ్చటి ప్రకృతి అందాలు.. కొండల మధ్య నుంచి వీచే గిలిగింతలు పెట్టే చిరుగాలులు చక్కటి అహ్లాదాన్ని పంచుతూ కోసిగి అందాలు కనువిందు చేస్తాయి.

కొండకోనల్లో కోసిగి

కోసిగి, జూలై 4: చుట్టూ కొండలు.. మధ్య పచ్చటి ప్రకృతి అందాలు.. కొండల మధ్య నుంచి వీచే గిలిగింతలు పెట్టే చిరుగాలులు చక్కటి అహ్లాదాన్ని పంచుతూ కోసిగి అందాలు కనువిందు చేస్తాయి. ఈ గ్రామం చెట్ల మధ్య పచ్చదనంతో చూపరులను కట్టిపడేస్తుంది. మూడు కొండల మధ్య పచ్చదనంతో కళకళలాడుతూ ఆనందాన్ని పంచుతుంది. గ్రామం చుట్టూ తిమ్మప్పకొండ, బసవన్న కొండ, రంగప్ప కొండల మధ్యలో ఉండే ఈ గ్రామ పరిసరాలు ప్రశాంతమైన, సుందరమైన, అహ్లాదకరమైన ఆనందాన్ని పంచుతాయి. కొండలపై ఉన్న పచ్చదనంతో కలిసి కోసిగి గ్రామమంతా విస్తరించిన పచ్చని చెట్లు, పంట పొలాల పైర్లు మనస్సును పరవశింపజేస్తాయి. తిమ్మప్పకొండపై నుంచి కోసిగి ఎరియల్‌ వ్యూ పర్యాటక ప్రేమికులను ఇట్టే కట్టి పడేస్తుంది. ముఖ్యంగా కోసిగిలోని 1, 2, 3, 4, 9 వార్డుల్లో విస్తరించిన గృహాలు పచ్చని చెట్ల మధ్య కొండపై నుంచి చూస్తే చూపరులను ఆకర్షిస్తుంది. 9వ వార్డులోని బాలురు, బాలికల ఉన్నత పాఠశాల, ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌, హాస్పిటల్‌, రేణుకా ఎల్లమ్మ, చౌడేశ్వరి దేవాలయం, రైల్వేస్టేషన్‌, పోలీస్‌స్టేషన్‌ అన్నీ ఫొటోలో కనిపిస్తుండటంతో కోసిగి అందాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి.

Updated Date - Jul 05 , 2024 | 12:20 AM