Share News

Election Results : ‘అపుస్మా’ అధ్యక్షుడిగా తులసీ విష్ణుప్రసాద్‌

ABN , Publish Date - Dec 31 , 2024 | 06:36 AM

ఏపీ ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(అపుస్మా-ఏపీయుఎ్‌సఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీరామా రూరల్‌ అకాడమీ చైర్మన్‌ కొలసాని తులసీ విష్ణుప్రసాద్‌ ఎన్నికయ్యారు.

 Election Results : ‘అపుస్మా’ అధ్యక్షుడిగా తులసీ విష్ణుప్రసాద్‌

కొల్లూరు, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(అపుస్మా-ఏపీయుఎ్‌సఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీరామా రూరల్‌ అకాడమీ చైర్మన్‌ కొలసాని తులసీ విష్ణుప్రసాద్‌ ఎన్నికయ్యారు. సోమవారం ఇక్కడి కేఎల్‌ యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ శ్రీనివాసరావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పి.వి.రమణారెడ్డి, అసోసియేట్‌ ఉపాధ్యక్షుడిగా జేఎ్‌సపీ బాలాజీ, జూనియర్‌ ఉపాధ్యక్షుడిగా ఎం.వి.సుబ్బారెడ్డి, కోశాధికారి డాక్టర్‌ ఎం.కృష్ణ, మరో 16 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అపుస్మా మాజీ అధ్యక్షుడు, రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాలు కృషి చేయాలని సూచించారు.

Updated Date - Dec 31 , 2024 | 06:37 AM