Share News

‘విడదల రజనీ’ కిడ్నాప్‌..!

ABN , Publish Date - Apr 27 , 2024 | 03:20 AM

ఎస్సీ మహిళ విడదల రజనీ గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేయడానికి సిద్ధపడ్డారు.

‘విడదల రజనీ’ కిడ్నాప్‌..!

స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేయకుండా పోలీసులే చేశారు

హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు... సోమవారం విచారణ

అమరావతి, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): ‘ఎస్సీ మహిళ విడదల రజనీ గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేయడానికి సిద్ధపడ్డారు. ఆమె నామినేషన్‌ వేయకుండా అడ్డుకోవడానికి అధికార పార్టీ నేతల ఒత్తిడితో నగరంపాలెం పోలీసులు ఆమెను కిడ్నాప్‌ చేశారు’ అంటూ శుక్రవారం హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలైంది. రజనీని అభ్యర్థిత్వాన్ని బలపరిచిన పఠాన్‌ అస్మతుల్లా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రజనీతో పాటు ఆమె భర్త అనురాగరావు ఆచూకీని పోలీసులు చెప్పడం లేదన్నారు. వారి ఇరువురిని కోర్టులో హాజరుపర్చేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎస్‌వీఎ్‌సఎస్‌ శివరాం శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యూ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభర్థించారు. వ్యాజ్యాన్ని లంచ్‌మోషన్‌గా తీసుకొనేందుకు ధర్మాసనం అంగీకరించింది. అయితే భోజన విరామ సమయం తరువాత ధర్మాసనంలోని ఓ న్యాయమూర్తి మరో బెంచ్‌లో కేసులు విచారిస్తుండడంతో ప్రస్తుత వ్యాజ్యం విచారణ సాధ్యపడలేదు. దీంతో పిటిషన్‌పై సోమవారం విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.

Updated Date - Apr 27 , 2024 | 03:20 AM