Share News

వైసీపీని తరిమికొట్టండి : మాజీ ఎమ్మెల్యే బీవీ

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:09 AM

అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన వైసీపీని జరగబోయే ఎన్నికల్లో తరిమి కొట్టలని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి యువతకు పిలుపునిచ్చారు.

వైసీపీని తరిమికొట్టండి : మాజీ ఎమ్మెల్యే బీవీ
బీవీ సమక్షంలో టీడీపీలో చేరుతున్న యువకులు

300 మంది యువకులు టీడీపీలో చేరిక

ఎమ్మిగనూరు,మార్చి10: అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన వైసీపీని జరగబోయే ఎన్నికల్లో తరిమి కొట్టలని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి యువతకు పిలుపునిచ్చారు. ఆదివారం నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 300 మంది యువకులు ఆర్పీఎస్‌ఎఫ్‌ నాయకులు షాహీద్‌ అఫ్రీద్‌, ఆర్‌యూఎస్‌ఎఫ్‌ నాయకులు రఘునాథ్‌ ఆధ్వర్యంలో యువకులు టీడీపీలో చేరారు. వీరిని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఎన్నికలకు ముందు జగన్‌ అనేక వాగ్దానాలు చేశారన్నారు. ప్రతి జనవరికి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2.38లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం భర్తి చేయలేదని విమర్శించారు. జాబు రావాలంటే బాబు రావాన్నారు. బాబు వస్తేనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సెల్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఉసేన్‌ పీరా, తురేగల్‌ నజీర్‌, ఆయా సంఘాల నాయకులు రహిమాన్‌, వీరేస్‌, వినయ్‌, నరసింహ, అజయ్‌, సత్య, నవీన్‌, సూర్య, శ్రీపాద, వంశీలు పాల్గొన్నారు.

అలాగే 10వ వార్డులో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా బీవీ ఇంటింటికి వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. మాజీ కౌన్సిలర్‌ జీఏ సలాం, మాజీ మున్సిపల్‌ వైఎస్‌ చైర్మన్‌ కొండయ్య చౌదరి, కౌన్సిలర్లు రామదాసు గౌడ్‌, దయాసాగర్‌, నాయకులు జహంగీర్‌, తురేగల్‌ నజీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 12:10 AM