Share News

ఖరీఫ్‌ ప్రణాళిక ఖరారు

ABN , Publish Date - May 25 , 2024 | 03:50 AM

రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్‌ పంటల సాగుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది. 81 లక్షల ఎకరాల్లో 24 రకాల వ్యవసాయ పంటల సాగు లక్ష్యంగా ఉన్నా..

ఖరీఫ్‌ ప్రణాళిక ఖరారు

85.65 లక్షల ఎకరాల్లో 167.15 లక్షల టన్నుల పంట ఉత్పత్తి అంచనా

అమరావతి, మే 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్‌ పంటల సాగుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది. 81 లక్షల ఎకరాల్లో 24 రకాల వ్యవసాయ పంటల సాగు లక్ష్యంగా ఉన్నా.. 85.65 లక్షల ఎకరాల్లో 167.15 లక్షల టన్నుల పంట ఉత్పత్తి వస్తుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా కురుస్తాయన్న వాతావరణశాఖ సూచన మేరకు సాధారణం కన్నా 4 లక్షల ఎకరాల్లో సాగు పెరుగుతుందని వ్యవసాయశాఖ భావిస్తోంది. ఖరీ్‌ఫలో రూ.200 కోట్ల రాయితీతో 5.49 లక్షల క్వింటాళ్ల వరి, చిరుధాన్యాలు, అపరాలు, నువ్వులు, వేరుశనగ వంగడాలను ఆర్బీకేల ద్వారా పంపిణీకి రిజిస్ర్టేషన్‌ చేపట్టారు. పచ్చిరొట్ట ఎరువులకు 84 వేల క్వింటాళ్ల జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలను ఇప్పటికే పంపిణీ చేపట్టారు. అలాగే ఖరీ్‌ఫలో రూ.99,600 కోట్ల పంట రుణాలు, కౌలురైతులకు ఈ ఏడాది రూ.5వేల కోట్లు రుణంగా ఇవ్వాలని బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. రబీలో రూ.66.400 కోట్లు పంట రుణంగా ఇవ్వనుంది. ఈ ఏడాది 10 లక్షల పంట సాగు హక్కు పత్రాలను జారీ చేయనున్నట్టు వ్యవసాయశాఖ తెలిపింది. ఖరీఫ్‌ అవసరాలకు 17.50 లక్షల టన్నుల రసాయన ఎరువులను కేటాయుంచగా, ఆర్బీకేల ద్వారా 5.60 లక్షల టన్ను లు సరఫరాకు నిర్ణయించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తయారు చేసినా, విక్రయించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ హెచ్చరించారు. 15 వేల చొప్పున విత్తన, ఎరువుల నమూనాలు, 10,500 పురుగు మందుల నమూనాలు సేకరించి, పరీక్షిస్తున్నట్టు శుక్రవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - May 25 , 2024 | 07:36 AM