Kesineni Nani: వచ్చే ఎన్నికల్లో విజయవాడ టికెట్ నాకు ఇవ్వనన్నారు..
ABN , Publish Date - Jan 05 , 2024 | 08:32 AM
ఫేస్‌బుక్ వేదికగా విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పారని నాని తెలిపారు. ఈ మేరకు తనకు గురువారం సాయంత్రం టీడీపీ నేతల ఆలపాటి రాజా, నెట్టేం రఘురాం, కొనకళ్ళ నారాయణ వచ్చి చెప్పారని వివరించారు.
అమరావతి: ఫేస్‌బుక్ వేదికగా విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పారని నాని తెలిపారు. ఈ మేరకు తనకు గురువారం సాయంత్రం టీడీపీ నేతల ఆలపాటి రాజా, నెట్టేం రఘురాం, కొనకళ్ళ నారాయణ వచ్చి చెప్పారని వివరించారు. తిరువూరులో చంద్రబాబు పాల్గొనే సభా నిర్వహణ బాధ్యతలను కూడా వేరే వారికి అప్పగించినట్లు చెప్పారని కూడా పేర్కొన్నారు. తనను జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారని నాని తెలిపారు.
అధినేత ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తానని వివరించారు. తిరువూరు సభ విషయంలో బుధవారం నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గాలు మధ్య వివాదం చెలరేగింది. తిరువూరు ఇన్‌చార్జి దేవదత్‌ను నాని పూజకు పనికి రాని పువ్వు అని దూషించడంపై టీడీపీ దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న సాయంత్రం చంద్రబాబుతో జిల్లా పార్టీ నేతల భేటీ జరిగింది. అందరినీ కలుపుకు వెళ్ళాలని చంద్రబాబు సూచించారు.